హోండా సిఆర్-వి రహస్య ఫోటోలు
2017 కు చెందిన సిఆర్-వి ఎస్‌యువికి హోండా సంస్థ మరో సారి పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న సిఆర్-వి కన్నా పై స్థానంలో ఈ నూతన తరానికి చెందిన సిఆర్-వి ఎస్‌యువిని అభివృద్ది చేశారు. ఇప్పటికే హోండా దీనికి అత్యంత భద్రత నడుమ అతి రహస్యంగా పలుమార్లు రహదారి పరీక్షలు నిర్వహించింది. వచ్చే ఏడాదికి దీనిని దేశీయ మార్కెట్‌కు సిద్దం చేయనుంది హోండా మోటార్స్.

ప్రస్తుతం ఇండియన్ రోడ్ల మీద ఉన్న సిఆర్-వి ఎస్‌యువి కన్నా 2017 సిఆర్-వి డిజైన్ ఎంతో అధునాతంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో రీఫ్రెష్డ్ లుక్‌తో మరింత కాంపాక్ట్‌గా అనిపిస్తుంది.

ప్రస్తుతం ఇండియన్ రోడ్ల మీద ఉన్న సిఆర్-వి ఎస్‌యువి కన్నా 2017 సిఆర్-వి డిజైన్ ఎంతో అధునాతంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో రీఫ్రెష్డ్ లుక్‌తో మరింత కాంపాక్ట్‌గా అనిపిస్తుంది.

అంతే కాకుండా కారు ఇంటీరియర్‌లోని డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్‌కు అదనపు సన్‌రూఫ్‌ను అందించారు.

వెనుక వైపు డిజైన్‌లో స్పష్టంగా కనబడే వీలున్నటువంటి నిలువుగా ఉన్న టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. టెయిల్ ల్యాంప్స్ మినహా పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు.

ఈ 2017 హోండా సిఆర్-వి తమ హెచ్‌ఆర్-వి నుండి అదనపు ఫీచర్లు అన్నింటిని గ్రహించింది.

ఇందులో ఏడు మంది ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే విధంగా క్యాబిన్‌ను డిజైన్‌ను చేసింది హోండా మోటార్స్.

సాంకేతికంగా 2017 హోండా సిఆర్-వి ఎస్‌యువి హెచ్‌ఆర్-వి క్రాసోవర్‌కు చెందిన 1.6-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో రానుంది.

- రానున్న 2016-17 లో విడుదల కానున్న రెనో కార్లు వివరాలు


Click it and Unblock the Notifications








