హోండా మోటార్స్ లోని అన్ని కార్ల మీద 10,000 రుపాయలకు పెంపు

By Anil

దేశీయంగా మంచి అమ్మకాలనే నమోదు చేసుకుంటున్న హోండా మోటార్స్ వారు 2016 నూతన సంవత్సరం నుండి తమ అన్ని మోడల్స్ మీద కూడా ధరలను పెంచింది. మోడల్‌ను బట్టి దాదాపుగా 2,000 నుండి 10,000 రుపాయల వరకు పెంపును ప్రకటించింది.

  • మీ నగరంలో మీకు నచ్చిన హోండా కార్ల ధరలు తెలుసుకోండి.

హోండా మోటార్స్ వారు ధరలను పెంచిన తరువాత ఏ మోడల్ కారు ఎంత ధరతో అందుబాటులో ఉందో ఓ సారి చూద్దామా...?

హోండా బ్రియో:

హోండా బ్రియో:

హోండా వారి ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు బ్రియో మీద 2,000 రుపాయల వరకు పెంచారు. పెరిగిన ధరతో బ్రియో హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ 4.28 లక్షలు ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ) గా ఉంది.

హోండా సిటి:

హోండా సిటి:

హోండా సిటి సెడాన్ కారులోని అన్ని వేరియంట్ల మీద దాదాపుగా 3,000 రుపాయల వరకు పెంపును ప్రకటించారు. హోండా వారి సిటి సెడాన్ కార్ల ప్రారంభ ధర 7.46 లక్షలు ఎక్స్ షో రూమ్(ఢిల్లీ) గా ఉంది.

హోండా మొబిలియో:

హోండా మొబిలియో:

హోండా మొబిలియో ఎమ్‌పివి కారు మీద కూడా దాదాపుగా 3,000 రుపాయల వరకు ధరను పెంచారు. ప్రస్తుతం మొబిలియో కారు ప్రారంభ ధర 6.82 లక్షలు ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ) గా అందుబాటులో ఉంది.

హోండా జాజ్

హోండా జాజ్

హోండా జాజ్ ప్రీమియమ్ హ్యాచ్ ‌బ్యాక్ కారు మీద 4,800 రుపాయల వరకు పెంపును ప్రకటించారు. ప్రస్తుతం ఈ హోండా హ్యాచ్‌బ్యాక్ కారు 5.45 లక్షలు ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ) గా అందుబాటులో ఉండనుంది.

హోండా సిఆర్-వి

హోండా సిఆర్-వి

హోండా మోటార్స్ వారు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన ఏకైక ఎస్‌యువీ మోడల్ సిఆర్-వి. ఈ ఎస్‌యువీ సిఆర్-వి కారు మీద అత్యధికంగా 10,000 రుపాయల వరకు పెంపును ప్రకటించింది. ప్రస్తుతం ఇది 21.24 లక్షలు ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ)గా అందుబాటులో ఉండనుంది.

హోండా బిఆర్-వి:

హోండా బిఆర్-వి:

హోండా మోటార్స్ వారు అతి త్వరలో ప్రారంభం కానున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద బిఆర్-వి ఎస్‌యువీ కారును ప్రదర్శించనుంది. దీనితో మరిన్ని ఇతర మోడల్స్‍‌ను కూడా ఈ ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించనుంది.

ధరలను పెంచిన హోండా మోటార్స్
  • సివిక్ కొత్త డిజైన్ అదిరింది..

More from DriveSpark

Article Published On: Monday, January 11, 2016, 13:05 [IST]
English summary
Honda India Announces Price Hike Up To Rs 10,000 Across Range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+