అన్ని ఉత్పత్తుల మీద లక్ష రుపాయల వరకు తగ్గింపు

By Anil

హోండా కార్స్ ఇండియా దేశీయంగా ఉన్న తమ అన్ని ఉత్పత్తుల మీద అద్బుతమైన ఆఫర్లు మరియు ప్రయోజనాలను ప్రకటించింది. గరిష్టంగా లక్ష రుపాయల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లన్ని కూడా కేవలం స్వల్ప కాలం మాత్రమే అందుబాటులో ఉన్నట్లు హోండా తెలిపింది.

మొబీలియో

మొబీలియో

హోండా మోటార్స్ తమ మొబీలియో మీద అద్బుతమైన ఆఫర్లు మరియు ప్రయోజనాలను ప్రకటించింది. అయితే కేవలం 2015 ఏడాదిలో ఉత్పత్తి అయిన మొబీలియో మోడళ్లకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తించును.

 హోండా కార్ల మీద ఆఫర్లు

మొబీలియోలోని డీజల్ మరియు పెట్రోల్ రెండు వేరియంట్ల మీద కూడా ఈ లక్ష రుపాయల ఆఫర్. అందుబాటులో ఉంచినట్లు హోండా తెలిపింది.

హోండా సిఆర్-వి

హోండా సిఆర్-వి

హోండా లోని ప్రీమియమ్ ఎస్‌యువి గరిష్టంగా 70,000 వరకు ఆఫర్లు మరియు లాభాలను అందుబాటులో ఉంచింది.

 హోండా కార్ల మీద ఆఫర్లు

అయితే సిఆర్-వి మీద ఈ ఆఫర్లను పొందాలంటే కేవలం 2015 లో ఉత్పత్తి అయిన మోడళ్లను ఎంచుకోవాలి. దేశ వ్యాప్తంగా ఉన్న హోండా డీలర్ల వద్ద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

హోండా సిటి 2015

హోండా సిటి 2015

హోండా సిటిలోని 2015 పెట్రోల్ మోడల్‌లోని అన్ని వేరియంట్ల మీద సుమారుగా 30,000 రుపాయల వరకు ఆఫర్లను అందుబాటులో ఉంచారు.

హోండా సిటి 2016

హోండా సిటి 2016

హోండా సిటి లోని 2016 మోడల్ యొక్క ఇ, ఎస్, ఎస్‌వి సివిటి, విఎక్స్ సివిటి అనే వేరియంట్ల మీద 15,000 రుపాయలను ఆఫర్లుగా ప్రకటించారు.

హోండా సిటి

హోండా సిటి

హోండా సిటి 216 మోడల్ లోని ఇతర వేరియంట్లైన ఎస్‌వి. వి, విఎక్స్, విఎక్స్ (ఒ) మ్యాన్యుల్ ట్రాన్స్‌మిషన్ వంటి వేరియంట్ల మీద కేవలం రూ. 1 తో ఇన్సూరెన్స్ అందిస్తున్నారు.

హోండా సిటి 2015 డీజల్ సెడాన్

హోండా సిటి 2015 డీజల్ సెడాన్

హోండా మోటార్స్ తమ సిటి 2015 మోడల్‌కు చెందిన డీజల్ సెడాన్ మీద సుమారుగా 60,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు.

హోండా సిటి 2016

హోండా సిటి 2016

హోండా సిటి లోని 2016 ఏడాదిలో ఉత్పత్తి అయిన సెడాన్‌ల మీద 15,000 రుపాయల విలువైన ఎక్స్‌చ్ఛేంజి ఆఫర్లు మరియు కేవలం రూ. 1 లతో ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు.

హోండా జాజ్ 2015

హోండా జాజ్ 2015

2015 ఏడాదిలో ఉత్పత్తి అయిన అన్ని జాజ్ మోడళ్ల మీద 60,000 రుపాయల విలువైన ఆఫర్లను అందుబాటులో ఉంచారు.

 హోండా జాజ్ 2016

హోండా జాజ్ 2016

2016 ఏడాదికి చెందిన జాజ్ డీజల్ లోని ఇ, ఎస్ ఎస్‌వి వేరియంట్ల మీద సుమారుగా 25,000 రుపాయల ఆఫర్లు అదే విధంగా వి మరియు విఎక్స్ వేరియంట్ల మీద 40,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు.

హోండా 2015 పెట్రోల్ జాజ్

హోండా 2015 పెట్రోల్ జాజ్

హోండా లోని 2015 ఏడాదిలో ఉత్పత్తి అయిన జాజ్ పెట్రోల్ విఎక్స్ వేరియంట్ మీద 40,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు. మరియు మిగతా వేరియంట్లు 15,000 రుపాయల వరకు ఆఫర్లతో ఉన్నాయి.

హోండా 2016 పెట్రోల్ జాజ్

హోండా 2016 పెట్రోల్ జాజ్

హోండా జాజ్ లోని 2016 ఏడాదికి చెందిన పెట్రోల్ వేరియంట్లు వి, విఎక్స్ ఆటోమేటిక్‌ల మీద 10,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు.

హోండా అమేజ్

హోండా అమేజ్

ఫేస్‌లిఫ్ట్ కంటే ముందు విడుదలైన 2015 అమేజ్ మీద లక్షల రుపాయల వరకు ఆఫర్లను అందించారు. 2016 లో ఉత్పత్తి అయిన ఫేస్‌లిఫ్ట్ కన్నా మునుపు అమేజ్ కాంపాక్ట్ సెడాన్ మీద సమారుగా 60,000 రుపాయల వరకు ఆఫర్లను అందించారు.

హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్

హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్

2016 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ లోని ఇ వేరియంట్ మినహాయించి మిగతా అన్ని వేరియంట్ల మీద 43,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు.

 హోండా బ్రియో

హోండా బ్రియో

2015 మోడల్‌కు చెందిన హోండా బ్రియోలోని అన్ని వేరియంట్ల మీద సుమారుగా 25,000 రుపాయలకు ఆఫర్లను అందించారు.

హోండా బ్రియో 2016

హోండా బ్రియో 2016

2016 ఏడాదిలో ఉత్పత్తి అయిన హోండా బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ల మీద కేవలం రూ. 1 లతో ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరం ఏమిటంటే హోండా వారి లేటెస్ట్ ఎస్‌యువి బిఆర్-వి మీద ఏ విధమైన ఆఫర్లను ప్రకటించలేదు.

More from DriveSpark

Article Published On: Thursday, September 29, 2016, 12:55 [IST]
English summary
Read In Telugu: Here Are The Offers & Discounts Honda Is providing In India
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+