హోండా అమేజ్ అస్సలు కొనుగోలు చేయకండి.... ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్న బాధితుడు
హోండా కార్ల గురించి మాట్లాడుకుంటే జపాన్‌కు చెందిన ఈ సంస్థ యొక్క కార్లు ఎంతో మన్నికైనవి మరియు విస్వసనీయమైనవి అని ఎక్కువగా అంటుంటారు. కాని సంజీవ్ గుప్తా అనే వ్యక్తి విషయంలో ఇది నిజం కాలేదు. ఘజియాబాద్‌కు చెందిన సంజీవ్ గుప్తా హోండా అమేజ్ కారును కొనుగోలు చేశాడు, అప్పటి నుండి హోండా కార్లను అస్సలు కొనుగోలు చేయకండి, అలా చేస్తే తీవ్రంగా మోసపోతారు అని ఏకంగా తన కారు మీద అక్షర రూపంలో వ్రాసి మరి ప్రచారం చేస్తున్నాడు. దీనికి అసలు కారణం ఏంటో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి...

ఘజియాబాద్‌కు చెందిన సంజీవ్ గుప్తా ఏప్రిల్ 2014 లో హోండా మోటార్స్‌కు చెందిన అమేజ్ డీజల్ కారును కొనుగోలు చేశాడు. దీనిని సుమారుగా 33,000 కిలోమీటర్ల మేర నడిపాడు.

33,000 కిలోమీటర్లు నడిచిన తరువాత తన హోండా అమేజ్ డీజల్ కారులోని ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను తెల్లగా పొగ వస్తున్నట్లు గుర్తించాడు.

గుప్తా కారు అప్పటికి ఇంకా వారంటీలో ఉంది. గుప్తా కారు వారంటీ వివరాలు 40,000 కిలోమీటర్లు లేదా రెండు సంత్సరాలు ఏది ముందుగా వచ్చినా. అయితే గుప్తా కారు విషయంలో అది వారంటీలో ఉంది. అందుకోసం ఓక్లా లోని సంభందిత కర్టసీ హోండా షోరూమ్‌లో సంప్రదించారు.

కారులోని సమస్య గురించి వారికి వివరించగా ఇంజన్‌లో తలెత్తిని లోపాన్ని సరిచేయడానికి సంభందిత డీలర్ సుమారుగా 60,000 రుపాయలను డిమాండ్ చేశారు. కాని తన కారు వారంటీలో ఉందని, ఉచితంగా సర్వీసు చేయాలని కోరాడు.

కారులోని సమస్య గురించి డీలర్ వివరిస్తూ, కారు ఇంజన్‌లో కొద్దిగా నీరు చేరిందని అందుకోసమే ఇలాంటి పొగ వస్తోందని చెప్పాడు. అయితే గుప్తా తెలివిగా ఇంజన్‌లోనికి నీరు ఏలా చేరుతుందని ప్రశ్నించాడు. దీనికి సమాదానంగా కారును ఎక్కువగా వర్షంలో నడపడం వలన ఇలా జరిగిందని వివరణ ఇచ్చాడు. అంటే వీరి ప్రకారం వర్షం వస్తే వాహనాన్ని నడపకూడదా...?

అయితే గుప్తా తన కారును సుమారుగా రెండు నెలల కాలం పాటు డీలర్ వద్దే వదిలేశాడు. కారును వినియోగించకున్నుప్పటికీ దానికి సంభందించిన కంతులు చెల్లించాడు.

ఈ రెండు నెలల మధ్య సమయంలో హోండా ఉన్నత అధికారులను కలవడానికి ఎంతో ప్రత్నించాడు, హోండా కాల్ సెంటర్ ఉద్యోగులు తమ ఉన్నతాధికారులతో మిమ్మల్ని కలుపుతాము అని చెబుతూ వచ్చారు. అయితే ఒక్కరితో కూడా గుప్తా కాల్‌ను కలపలేదు.

అంతే కాకుండా తనకున్న వారంటీ గురించి ప్రస్తావించినప్పటికీ ఎటువంటి ప్రయత్నం లేకపోయింది. ఇది సాంకేతిక లోపం కాదంటూ హోండా ఇంజనీర్లు ఫిరాయించారు. దీనిని ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేసుకోమని సలహాలిచ్చారు.

వారి చర్యలకు విసిగివేసారిపోయిన ఈ హోండా అమేజ్ డీజల్ కారు యాజమాని ఇంటికి వెళ్లిపోయి గత ఏడాది సెప్టెంబర్ వరకు హోండాకు వ్యతిరేకమైన ఎన్నో చర్యలు చేసాడు.

హోండా ఇంజనీర్లు మరియు హోండా మోటార్స్ యాజమాన్యం చేసిన మోసానికి ఇతను సుమరుగా 37,749 రుపాయలతో ఇంజన్‌ను రిపేరి చేయించుకున్నాడు.

అన్ని సర్వీసింగ్‌లు మరియు రిపేరీల తరువాత ఇంటికి చేరుకున్న సంజీవ్ గుప్తా హోండా కార్లను కొనుగోలు చేయవద్దని తన కారు ద్వారా ప్రత్యేక ప్రచారం నిర్వహించాడు.

నేను హోండా అమేజ్ కారు కొనుగోలు చేశాను, వారంటీ ఉన్నప్పటికీ దానికి తగ్గ సర్వీసు చేయలేదు, మీరు కూడా హోండా కార్లు కొనుగోలు చేసి మోసపోవద్దు అంటూ కారుకు అన్ని వైపులా పోస్టర్లు అంటించి, పెయింట్‌తో అక్షర రూపంలో వ్రాసి మరీ ప్రచారం చేస్తున్నాడు.

శకుంతల రైల్వే ఇప్పటికీ ఇండియన్ రైల్వేలో భాగంకాదు
విమాన ప్రమాదం చివరి క్షణాల్లో ఇలా: ప్రత్యేక ఫుటేజ్


Click it and Unblock the Notifications








