హోండా నుండి డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువి

హోండా మోటార్స్ తమ ప్రొడక్షన్ రెడీ డూబ్ల్యూఆర్-వి ఎస్‌యువిని అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంద. వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఎస్‍‌యువిల మీద ఆదిపత్యమే లక్ష్యంగా విడుదలకు సిద్దమవుతోంది.

By Anil

హోండా మోటార్స్ తమ ప్రొడక్షన్ రెడీ డబ్ల్యూఆర్-వి ఎస్‌యువిని ఆవిష్కరించింది. హోండా జాజ్ క్రాసోవర్-హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో డబ్ల్యూఆర్-వి ని అభివృద్ది చేసింది. 2017 మధ్య భాగానికి హోండా దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

హోండా మోటార్స్ కథన ప్రకారం, దక్షిణ అమెరికాలో వినియోగదారుల సూచనలు మరియు సలహాల మేరకు రీసెర్చ్ చేసి ఈ డబ్ల్యూఆర్-వి ని రూపొందించినట్లు తెలిసింది.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

దక్షిణ అమెరికా కస్టమర్ల అభీష్టం మేరకు జపాన్‌కు చెందిన హోండా అభివృద్ది చేసిన డబ్ల్యూఆర్-వి క్యాబిన్ స్పేస్ పరంగా అద్బుతం అని చెప్పాలి. విశాలమైన ఇంటీరియర్ దీని సొంతం.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

అత్యధిక మైలేజ్ మరియు ప్రయాణ సమయంలో వాహాన్ని స్థిరంగా నియంత్రించే వ్యవస్థ అను రెండు ముఖ్యమైన అంశాలను అస్త్రంగా మలుచుకుని అభివృద్ది చేసినట్లు హోండా తెలిపింది.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

హోండా మోటార్స్ ఈ డబ్ల్యూఆర్-వి ఎస్‌యువిని 2017 ప్రారంభంలో బ్రెజిల్ మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

హోండా డబ్ల్యూఆర్-వి అధునాతన ఫ్రంట్ బంపర్ కలిగి ఉంది. జాజ్ హ్యాచ్‌బ్యాక్ తో పోల్చితే విభిన్నమైన హెడ్ లైట్లు, నల్లటి తొడుగులను కలిగి ఉంది. రెండు హెడ్ ల్యాంప్స్ మధ్యలో బిఆర్-వి ఎస్‌యువి తరహా హారిజంటల్ సింగల్ క్రోమ్ స్ట్రిప్ కలదు.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యువి లక్షణాల కలయికలో రూపొందించబడినట్లు డబ్ల్యూఆర్-వి ని ప్రక్క వైపు నుండి చూస్తే స్పష్టంగా అవగతం అవుతుంది. ప్రక్క మరియు వెనుక వైపున బాడీ అంచున ప్లాస్టిక్ క్లాడింగ్ అందించింది.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

డబ్ల్యూఆర్-వి ధరను తక్కువగా ఉంచుతూన జాజ్ ఇంటీరియర్ లక్షణాలతో దీని ఇంటీరియర్ నిర్మాణం చేపట్టినట్లు హోండా తెలిపింది.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

ప్రక్కవైపున ఉన్న డోర్లు దాదాపుగా హోండా జాజ్ తరహాలోనే ఉన్నాయి. మరియు వెనుక వైపున కూడా డబ్ల్యూఆర్-విలో సరికొత్త బంపర్, టెయిల్ లైట్లు మరియు నెంబర్ ప్లేట్ కలదు.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

సాంకేతికంగా హోండా మోటార్స్ ఈ డబ్ల్యూఆర్-విలో 89బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ ఐ-విటిఇసి బ్రియోలో వినియోగించిన పెట్రోల్ ఇంజన్ కలదు.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

సిటి మరియు మొబీలియోలో వినియోగించిన 99బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ కలదు.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

ట్రాన్స్‌మిషన్ పరంగా పెట్రోల్ వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి గేర్‌బాక్స్ అనుసంధానంతో మరియు డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి.

హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యువి

  • రెండు కొత్త వాహనాలను విడుదల చేయనున్న మహీంద్రా
  • రెనో క్విడ్ ఏఎమ్‌టి విడుదల: ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు
  • ఈ నెలలో బజాజ్ క్రటోస్ విఎస్400 స్పోర్ట్స్ బైకు విడుదల

More from DriveSpark

Article Published On: Saturday, November 12, 2016, 15:07 [IST]
English summary
Honda Reveals WR-V Compact SUV; India Launch In March 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+