నోట్ల రద్దు కారణంతో సరికొత్త ప్లాన్‌తో సిద్దమైన హోండా కార్స్

రూ. 500, 1000 నోట్ల రద్దు నేపథ్యంలో కార్లు మరియు బైకులు అమ్మకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మోడీ నిర్ణయాన్ని నిర్ణయంతో విక్రయాలకు వాటిల్లిన సమస్యను అధిగమించేందుకు హోండా కార్స్ సరికొత్త పథకం పన్నింది.

By Anil

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ. 500, రూ. 1000 నోట్ల చెలామణి రద్దు నిర్ణయం దేశీయం అటోమొబైల్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్లు మరియు బైకుల అమ్మకాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఈ సమస్యను అధగమించేందుకు అనేక సంస్థలు ఇప్పటికే జీరో డౌన్ పేమెంట్‌తో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటి దారిలోనే జపాన్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఒక కొత్త ప్రణాళికతో ముందడుగు వేసింది.

హోండా మోటార్స్

కస్టమర్లు తమ కార్లను కొనుగోలు చేయడానికి నోట్ల రద్దు అస్సలు సమస్య కాకూడదని దేశీయంగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి. ఐసిఐసిఐ మరియు యాక్సిస్ వంటి బహుళ జాతి బ్యాంకులతో చేతులు కలిపి 100 శాతం నిధులను సమకూర్చనుంది.

హోండా మోటార్స్

బ్యాంకులతో హోండా మోటార్స్ చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయం ఉపాధి కల వారు మరియు ఉద్యోగం గల వారు తమ (హోండా) కార్లను ఎంచుకోవడానికి మార్గం సుగమం అయ్యింది.

హోండా మోటార్స్

ఇవే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ హోండా డీలర్లు కస్టమర్లకు ఎంచుకునే ఉత్పత్తుల ఆధారంగా ప్రత్యేకమైన వడ్డీ రేట్లను అందిస్తున్నారు.

హోండా మోటార్స్

ఎక్స్ షోరూమ్ ధర మీద బ్యాంకుల ద్వారా 100 శాతం బుణాన్ని పొందే అవకాశం కలదు, అంటే ఆన్ రోడ్ ధరలో దాదాపుగా 90 శాతం వరకు బుణం లభిస్తుంది.

హోండా మోటార్స్

ఇక ఆయా షోరూముల్లో ఉండే పాత మరియు కొత్త ఉత్పత్తుల మీద విభిన్న ఆఫర్లు కూడా ఉన్నాయి.

హోండా మోటార్స్

ఇకపై దేశ వ్యాప్తంగా జరిగే ప్రతి హోండా కారు కొనుగోలు పై నగదు రహిత చెల్లింపులను ప్రారంభించింది మరియు బ్యాంకుల ద్వారా చేసుకున్న ఒప్పందం ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందుబాటులో ఉంచింది హోండా కార్స్ ఇండియా లిమిటెడ్.

హోండా మోటార్స్

బ్యాంకులు అందించే వడ్డీ రేట్లకు సంభందించిన వివరాలకు ముందుగా హోండా డీలర్లను సంప్రదించడం ఉత్తమం.

హోండా కార్లకు చెందిన మరిన్ని కథనాలు మీ కోసం....

 దేశీయంగా అందుబాటులో ఉన్న హోండా కార్ల జాబితా...

దేశీయంగా అందుబాటులో ఉన్న హోండా కార్ల జాబితా...

  • హోండా బ్రియో
  • హోండా అమేజ్
  • హోండా జాజ్
  • హోండా సిటి
  • హోండా మొబీలియో
  • హోండా బిఆర్-వి
  • హోండా సిఆర్-వి
  • అకార్డ్ హైబ్రిడ్
  • హోండా మోటార్స్

    • 70 లక్షల కార్లతో రికార్డు సృష్టించిన హ్యుందాయ్ మోటార్స్
    • స్కూటర్ల రాజ్యం: దేశీయంగా విడుదల కానున్న స్కూటర్లు
    • ఇగ్నిస్ గురించి గుడ్ న్యూస్

More from DriveSpark

Article Published On: Tuesday, November 22, 2016, 12:29 [IST]
English summary
Read In Telugu: Honda Teams Up With HDFC, ICICI & AXIS Bank For Car Sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+