మరింత ప్రియమైన హ్యుందాయ్ కార్లు

By Anil

దేశీయ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సంస్థకు డైరెక్ట్ కాంపిటీషన్‌గా నిలిచిన హ్యుందాయ్ మోటార్స్ దేశ వ్యాప్తంగా ఉన్న తమ ఫోర్ట్ ఫోలియోలోని ఉత్పత్తుల మీద ధరల పెంపును ప్రకటించింది.

దక్షిణ కొరియాకు చెందిన బహుళ కార్ల తయారీ సంస్థ ఏ మేరకు ధరలను పెంచిందో స్పష్టంగా వెల్లడించలేదు. అయితే ఇయాన్ మీద రూ. 3,000 లు మరియు శాంటా ఫి మీద రూ. 20,000 వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి.

మరింత ప్రియమైన హ్యుందాయ్ కార్లు

హ్యుందాయ్ మోటార్స్ టాప్ సెల్లింగ్ కారు క్రెటా మీద సుమారుగా రూ. 16,000 లు నుండి 20,000 వరకు పెంపును చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గత లో 2016-2017 యూనిట్ బడ్జెట్ సందర్భంగా హ్యుందాయ్ తమ ఉత్పత్తుల మీద ధరను పెంచింది.

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ రాకేశ్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ, రుపాయి విలువ తగ్గడం మరియు ముడి భాగాలు ధరలు పెరగడం కారణంగా తమ ఉత్పత్తుల మీద ధరలను పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆగష్టు 16, 2016 నుండి పెరిగిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. తమ శ్రేణిలో ఉన్న మొత్తం వాహనాల మీద 3,000 నుండి 20,000 ల రుపాయల వరకు పెంచనున్నట్లు ప్రకటించారు.
Also Read: మీకు తెలుసా ? ఇవన్నీ ఒకప్పుడు ఇండియాలో విడుదలైన టూ వీలర్లే !
హ్యుందాయ్ ఇండియాలో రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మరియు ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. గడిచిన జూలై 2016 లో సుమారుగా 55,807 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఇందులో 14,606 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.
Also Read: గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు
2015 లో దేశీయంగా అందుబాటులోకి తెచ్చిన క్రెటా ఇప్పటి వరకు సుమారుగా 80,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. తద్వారా గడిచిన జూలై 2015 తో పోల్చుకుంటే జూలై 2016 లో 10.7 శాతం వృద్దిని సాధించింది.

Article Published On: Saturday, August 6, 2016, 11:25 [IST]
English summary
Hyundai Announces Price Hike Across Its Models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+