రూ. 2,50,000 ల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్స్ దేశ వ్యాప్తంగా తమ పోర్ట్‌పోలియోలో ఉన్న సెలక్టివ్ ఉత్పత్తులపై భారీ స్థాయిలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
హ్యుందాయ్ మోటార్స్ తమ లైనప్‌లో ఉన్న ఎంచుకోదగ్గ మోడళ్ల పై భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకచింది. కార్పోరేట్ స్కీమ్ మరియు కన్జ్యూమర్ ఆఫర్ల క్రింది భారీ కస్టమర్లకు పెద్ద మొత్తంలో లబ్ది చేకూర్చే ఆఫర్లను ప్రకటించింది.

హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ లైనప్‌లోని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇయాన్ మీద కన్జ్యూమర్ ఆఫర్‌గా రూ. 55,000 లు మరియు కార్పోరేట్ కస్టమర్లకు రూ. 2,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
గ్రాండ్ ఐ10 లోని పెట్రోల్ వేరియంట్ మీద రూ. 76,000 లు మరియు గ్రాండ్ ఐ10 డీజల్ వేరియంట్ మీద రూ. 84,000 లు వరకు కంస్యూమర్ ఆఫర్ ద్వారా డిస్కౌంట్ లభిస్తుంది. రెండు ఇంధన వేరియంట్ల మీద కూడా కార్పోరేట్ స్కీమ్ క్రింద అదనంగా 3,000 రుపాయల చొప్పున డిస్కౌంట్ లభిస్తోంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్
హ్యుందాయ్ కాంపాక్ట్ సెడాన్ ఎక్సెంట్ మీద కన్జ్యూమర్ ఆఫర్ రూపంలో 40,000 రుపాయలు మరియు కార్పోరేట్ కస్టమర్లకు 3,500 రుపాయల వరకు డిస్కౌంట్ల అందిస్తోంది. మొత్తం మీద హ్యుందాయ్ ఎక్సెంట్ మీద రూ. 43,500 ల డిస్కౌంట్ కలదు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మీద కన్జ్యూమర్ ఆఫర్‌గా 10,000 రుపాయలు మరియు కార్పోరేట్ ఆఫర్‌గా 5,000 ల డిస్కౌంట్ కలదు. మొత్తం 15,000 రుపాయల డిస్కౌంట్‌తో ఎలైట్ ఐ20 లభిస్తోంది

హ్యుందాయ్ వెర్నా
వెర్నాలోని బేస్ వేరియంట్ కన్జ్యూమర్ ఆఫర్ క్రింద 6.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. మరియు దీని మీద కార్పోరేట్ స్కీమ్ క్రింద 20,000 రుపాయల వరకు డిస్కౌంట్ కలదు.
వెర్నాలోని ఇతర వేరియంట్లు కన్జ్యూమర్ ఆఫర్ క్రింద రూ. 90,000 ల మరియు కార్పోరేట్ స్కీమ్ క్రింద 20,000 రుపాయల డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఎలంట్రా
హ్యుందాయ్ ప్రీమియ్ సెడాన్ ఎలంట్రా మీద కార్పోరేట్ స్కీమ్ పరంగా 20,000 రుపాయల వరకు డిస్కౌంట్ కలదు.

హ్యుందాయ్ శాంట్ ఫె
హ్యుందాయ్ మోటార్స్ లోని టాప్ ఎండ్ మోడల్ శాంట్ ఫె మీద కన్జ్యూమర్ ఆఫర్ క్రింద రూ. 2 లక్షలు మరియు కార్పోరేట్ స్కీమ్ క్రింద 50,000 రుపాయల డిస్కౌంట్ కలదు. మొత్తం మీద శాంటా ఫె 2,50,000 రుపాయల డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ మోటార్స్ లోని ఉత్పత్తులను కొనాలనుకునే వారికి దీనిని మించి తరుణం మళ్లీ రాదని మా అభిప్రాయం. హ్యుందాయ్ ప్రకటించే అరుదైన భారీ ఆఫర్లలో ఇదీ ఒకటి.

- ఆరు లక్షలకే బెంజ్ కారా ఇదెలా సాధ్యం
- ఖరారైన బజాజ్ డొమైనర్ విడుదల: పూర్తి వివరాలు...
- ఐ10 ప్రొడక్షన్ కు పుల్ స్టాప్ పెట్టిన హ్యుందాయ్


Click it and Unblock the Notifications








