హ్యుందాయ్ నుండి క్రెటా ఆధారిత ఎస్‌యవి అతి త్వరలో
హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి 2017 నాటికి క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది.
హ్యుందాయ్ మోటార్స్ దేశీయ విపణిలోకి తమ అత్యంత విజయవంతమైన క్రెటా ఎస్‌యువిని ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సిద్దమవుతోంది. బ్రెజిల్ మార్కెట్లో క్రెటా విడుదలకు ముందే దేశీయంగా క్రెటా ఫేస్‌లిఫ్ట్ విడుదల కానుంది.

హ్యుందాయ్ మోటార్స్ బ్రెజిల్ విపణిలోకి విడుదల చేయనున్న నూతన క్రెటా ఎస్‌యువికి చెందిన కొన్ని చిత్రాలను విడుదల చేసింది.

ప్రారంభంలో క్రెటా ఐఎస్25 అనే పేరుతో విడుదైలనప్పటికీ తర్వాత కాలంలో క్రెటా గా కొనసాగింది.

2017 నాటికి మార్కెట్లోకి విడుదల కానున్న క్రెటా ఎస్‌యువి విభిన్న కాస్మొటకి మెరుగుల జోడింపుతో మార్పులను సంతరించుకోనుంది, అయితే సాంకేతికంగా ఏ విధమైన మార్పులు జరగట్లేదు.

క్రెటా ముందు వైపున ఉన్న ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్ మరియు ఫ్రంట్ బంపర్ పరంగా మార్పులు జరిగే అవకాశం ఉంది.

సరికొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో విశాలమైన క్రోమ్ ఫినిషింగ్ గల ఫ్రంట్ గ్రిల్, నూతనంగా డిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్ మరియు అధునాతన శైలిలో ఉన్న అల్లాయ్ వీల్స్‌ను అందిస్తోంది.

వెనుక వైపున డిజైన్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అత్యధిక క్రోమ్ ఫినిషింగ్ మరియు అధునాత టెయిల్ లైట్ డిజైన్ అందించారు. ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.

హ్యుందాయ్ 2017 నాటికి టక్సన్ ఎస్‌యువి మరియు సరికొత్త ఎలంట్రాలను విడుదల చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా గ్రాండ్ ఐ10, ఎక్సెంట్ మరియు క్రెటా వంటి ఉత్పత్తులు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదలకానున్నాయి.

క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 2017 నాటికి దేశీయ మార్కెట్లోకి సిద్దం చేయనుంది. 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో కన్నా ముందుగా భారీగా తమ ఉత్పత్తులను విడుదల చేయడం పట్ల 2018 ఆటో ఎక్స్ పో లో ఏ విధమైన ఉత్పత్తులను పరిచయం చేస్తోందో అని సర్వత్రా ఆసక్తిగా ఉంది.

- ఉద్యోగులకు 1,260 కార్లను బహుకరించిన సూరత్ వజ్రాల వ్యాపారి
- ఈ భారతీయ రోడ్ల మీద ప్రయాణం తాడు మీద నడిచే అనుభవానికి సమానం !
- ఈ కొత్త కారుతో మార్కెట్‌ను కుదిపేయడం ఖాయం అంటున్న మారుతి


Click it and Unblock the Notifications








