క్రెటా పెట్రోల్ ఇంజన్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సొగసులద్దిన హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తమ క్రెటా పెట్రోల్ వేరియంట్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అందించింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోని ఎస్‌యువి సెగ్మెంట్లో భారీ స్థాయిలో అమ్మకాలు సాధిస్తున్న హ్యుందాయ్ వారి క్రెటా గతంలో కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించేది. అయితే ఇప్పుడు పెట్రోల్ వేరియంట్‌ను కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గొడుగు క్రిందకు తీసుకు వచ్చింది.
హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ కు చెందిన ధర మరియు ఇతర వివరాలు క్రింది కథనంలో గుర్తించగలరు.

హ్యుందాయ్ వారి కాంపాక్ట్ ఎస్‌యువి పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 13.48 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్) గా ఉంది.

ప్రస్తుతం హ్యుందాయ్ వారి పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ కేవలం ఎస్ఎక్స్ + ట్రిమ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రస్తుతం దీనికి సంభందించి బుకింగ్స్ దేశ వ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్ల వద్ద అందు్బాటులో ఉన్నాయి. ఈ వేరియంట్‌ను రూ. 25,000 లతో బుక్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ మోటార్స్ వారు ఇంకా దీనికి సంభందించి ధరలను తమ అధికారిక వైబ్‌సైట్ మీద అందివ్వలేదు.

ఇందులో ఇంజన్ పరంగా 1.6-లీటర్ కెపసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు.

ఈ ఇంజన్ సుమారుగా 122 బిహెచ్‌పి పవర్ మరియు 154 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇందులో హ్యుందాయ్ మోటార్స్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

ప్రారంభంలో హ్యుందాయ్ మోటార్స్ ఈ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే అందించింది.


Click it and Unblock the Notifications