మార్కెట్ నుండి క్రెటా పెట్రోల్ వేరియంట్‌ను తొలగిస్తున్న హ్యుందాయ్
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ఎస్‌యువిల అమ్మకాలు చేపట్టిన వాటిలో హ్యుందాయ్ వారి క్రెటా మొదటి స్థానంలో ఉంది. అంతే కాకుండా హ్యుందాయ్ వారి లైనప్‌లో ఉత్తమ అమ్మకాలు సాధిస్తున్న పాపులర్ ఎస్‌యువి కూడా ఇదే. అయితే క్రెటా పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్ నుండి నిష్క్రమింపచేస్తున్నట్లు తెలిసింది.

హ్యుందాయ్ మోటార్స్ వారి క్రెటా ఎస్‌యువిలోని ఎస్ వేరియంట్‌ను మార్కెట్ నుండి అదే విధంగా తమ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా తొలగిస్తోంది.

ఈ ఎస్ వేరియంట్ పెట్రోల్ క్రెటా ను మార్కెట్ నుండి తొలగించడానికి కారణం ఇ ప్లస్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకురావడం అని తెలిసింది. అది కూడా దానిని కేవలం 9.99 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించింది.

ప్రస్తుతం క్రెటా పెట్రోల్ లైనప్‌లో ఇ, ఇ ప్లస్, ఎస్ఎక్స్ ప్లస్, ఎస్ఎక్స్ ప్లస్ స్పెషల్ ఎడిషన్ మరియు ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

పెట్రోల్ క్రెటాలో 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 122బిహెచ్‌పి పవర్ మరియు 154ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేసారు. పెట్రోల్ వేరియంట్ క్రెటా లీటర్‌కు 15.29కిలోమీర్ల మైలేజ్ ఇవ్వగలదు.

పెట్రోల్ లైనప్ నుండి వైదొలగిన క్రెటా ఎస్ పెట్రోల్ వేరియంట్ యథావిధిగా డీజల్ లైనప్‌లో అందుబాటులో ఉంది. డీజల్ క్రెటాలో 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులోని ఇంజన్‌లు వరసగా 89బిహెచ్‌పి మరియు 126బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

డీజల్ వేరియంట్ క్రెటా ఎస్‌యువిలు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో అనుసంధానమై ఉన్నాయి.

క్రెటా లోని 1.4-లీటర్ ఇంజన్ లీటర్‌కు 21.38 కిలోమీటర్లు, 1.6-లీటర్ ఇంజన్ లీటర్‌కు 19.67కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ వేరియంట్ ఇంజన్ లీటర్‌కు 17.01 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.


Click it and Unblock the Notifications








