హ్యుందాయ్ క్రెటా ఆధారిత పికప్ ట్రక్ ప్రదర్శన
హ్యుందాయ్ మోటార్స్ ఎస్‌టిసి పికప్ కాన్సెప్ట్ ట్రక్కును ప్రదర్శించింది. 2016 Sao Paulo ఆటో షో వేదికగా క్రెటా ఆధారిత పికప్ ట్రకప్ ట్రక్కును కాన్సెప్ట్ రూపంలో ప్రవేశపెట్టింది.
హ్యుందాయ్ మోటార్స్ లైనప్‌లో విడుదలైన క్రెటా కాంపాక్ట్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మరిన్ని క్రెటా ఆధారిత ఉత్పత్తులకు హ్యుందాయ్ రంగం సిద్దం చేసింది. బ్రెజిల్‌లో జరుగుతున్న 2016 Sao Paulo ఆటో షో వేదిక క్రెటా అధారిత ఉత్పత్తుల ప్రదర్శనకు నిలయమైంది. క్రెటా ఆధారిత ఎస్‌టిసి పికప్ ట్రక్కును కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది.

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ తమ క్రెటా ఫేస్‌లిఫ్ట్ తరువాత క్రెటా ఆధారిత పికప్ ట్రక్ ఎస్‌టిసి( స్పోర్ట్ ట్రక్ కాన్సెప్ట్) ను ప్రదర్శించింది.

హ్యుందాయ్ మోటార్స్ ప్రధాన కేంద్రం దక్షిణ కొరియాలోని హ్యుందాయ్ డిజైన్ సెంటర్‌లో ఈ అధునాత క్రెటా ఆధారిత పికప్ ట్రక్కుకు రూపకల్పన జరిగినట్లు హ్యుందాయ్ ప్రతినిధులు తెలిపారు. దీనిని ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌టిసి పికప్ ట్రక్ 21-అంగుళాల పరిమాణం గల పిరెల్లీ టైర్లను కలిగి ఉంది. స్పోర్టివ్ శైలలో ఉన్న ఫ్రంట్ బంపర్ మరియు ఎల్ఇడి హెడ్ లైట్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ హ్యుందాయ్ క్రెటా ఎస్‌టిసి ఇంటీరియర్‌ను అల్యూమినియం సొబగులతో తీర్చిదిద్దారు.

కొలతల పరంగా ఈ క్రెటా ఎస్‌టిసి 4.65 మీటర్లు పొడవు, 1.85 మీటర్ల వెడల్పు, 1.63 మీటర్లు ఎత్తు మరియు 2.80 మీటర్ల పొడవైన వీల్ బేస్ కలదు.

ప్రయాణికుల కోసం విశాలమైన క్యాబిన్ మరియు క్యాబిన్ వెనుక భాగంలో 850 లీటర్ల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ స్పేస్ అందించారు.

క్రెటా ఎస్‌టిసి పికప్ ట్రక్కు పూర్తిగా కాన్సెప్ దశలోనే ఉంది. దీనికి సంభందించిన సాంకేతిక వివరాలు లభ్యం కాలేదు. అయితే 1.6-లీటర్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్‌లతో పరిచయం అయ్యే అవకాశం ఉంది.

కాన్సెప్ట్ దశ నుండి ప్రొడక్షన్ దశకు వస్తే ఇది రెనో వారి Duster Oorch మరియు Fiat Toro వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

- హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ తొలి పరిచయం
- టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్
- డ్యూక్ కాదు రాకెట్


Click it and Unblock the Notifications








