ఆగష్టు 23, 2016 న విడుదల కానున్న నూతన హ్యుందాయ్ ఎలంట్రా
హ్యుందాయ్ మోటార్స్ తమ 2016 ఎలంట్రా కారును ఈ ఆగష్టు 23 న దేశీయంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. సరికొత్త 2016 ఎలంట్రా కు సంభందించిన బుకింగ్‌లను ప్రారంభించారు.

సరికొత్త ఎలంట్రాను ఢిల్లీ డీలర్లు 25,000 రుపాయల ప్రారంభ ధరతో మరియు ముంబాయ్ డీలర్లు 50,000 ప్రారంభ ధరలతో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించారు. ఈ సరికొత్త 2016 ఎలంట్రా ప్రస్తుతం ఉన్న ఎలంట్రా స్థానాన్ని భర్తీ చేస్తూ, స్కోడా వారి ఆక్టావియా మరియు టయోటా వారి కరోలా ఆల్టిస్ లకు పోటీగా నిలవనుంది.
Also Read: ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఐదు కొత్త కార్ల సంస్థలు
హ్యుందాయ్ మోటార్స్ ఈ 2016 ఎలంట్రాలో 2.0-లీటర్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 147బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ ఇంజన్ 134బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. సరికొత్త 2016 ఎలంట్రా 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: విమాన ప్రమాదం చివరి క్షణాల్లో ప్రత్యేక ఫుటేజ్: విపత్తు తర్వాత సెల్ఫీ !
హ్యుందాయ్ మోటార్స్ ఈ 2016 ఎలంట్రాను 16 నుండి 20 లక్షల ధర శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాత ఎలంట్రా స్టాకును క్లియర్ చేయడాని డీలర్లు హ్యుందాయ్ సుమారుగా 30,000 నుండి 50,000 వేల రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications








