ఆశ్చర్యపరిచే ధరతో విడుదలైన ఆరవ తరానికి చెందిన హ్యుందాయ్ ఎలంట్రా
ఇండియన్ మార్కెట్లో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా ఎదుగుతున్న హ్యుందాయ్ మోటార్స్ ఎంతో కాలంగా విడుదల చేయాలని ఎదురుచూస్తున్న తమ ఆరవ తరానికి చెందిన ఎలంట్రా సెడాన్‌ను నేడు (23 ఆగష్టు 2016) విడుదల చేసింది. హ్యుందాయ్ ఈ ఎలంట్రా యొక్క పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 12.99 లక్షలు మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 14.79 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించింది.
హ్యుందాయ్ మోటార్స్ యొక్క ఆరవ తరానికి చెందిన ఎలంట్రా సెడాన్ యొక్క పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఆరవ తరానికి చెందిన ఎలంట్రా పెట్రోల్ వేరియంట్ ధరలు
- ఎలంట్రా ఎస్ ధర రూ. 12,99,000 లు
- ఎలంట్రా ఎస్ఎక్స్ ధర రూ. 14,79,000 లు
- ఎలంట్రా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ధర రూ. 15,89,000 లు
- ఎలంట్రా ఎస్ఎక్స్ (ఒ) ధర రూ. 16,59,000 లు
- ఎలంట్రా ఎస్ఎక్స్ (ఒ) ఆటోమేటకి ధర రూ. 17,99,000 లు
- ఎలంట్రా ఎస్ ధర రూ. 14,79,000 లు
- ఎలంట్రా ఎస్ఎక్స్ ధర రూ. 16,39,000 లు
- ఎలంట్రా ఎస్ఎక్స్ (ఒ) ధర రూ. 17,69,000 లు
- ఎలంట్రా ఎస్ఎక్స్ (ఒ) ఆటోమేటిక్ ధర రూ. 19,19,000 లు
- అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- పోలార్ వైట్,
- మెరైన్ బ్లూ,
- స్లీక్ సిల్వర్,
- రెడ్ ప్యాసన్ మరియు
- ఫాంథమ్ బ్లాక్.
- హిస్టరీలో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే ...!!

ఆరవ తరానికి చెందిన ఎలంట్రా డీజల్ వేరియంట్ ధరలు

ఇంజన్
హ్యుందాయ్ మోటార్స్ ఈ ఆరవ తరానికి చెందిన ఎలంట్రాలో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు క్రెటా ఎస్‌యువి అదే విధంగా వెర్నాలలో ఉన్న 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించారు.

పవర్ మరియు టార్క్
పెట్రోల్ ఇంజన్ సుమారుగా 150బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విదంగా డీజల్ ఇంజన్ 126బిహెచ్‌పి పవర్ మరియు 265ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్
ఇందులోని పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానం చేశారు.

డ్రైవింగ్ మోడ్స్
హ్యుందాయ్ మోటార్స్ తమ ఆరవ తరానికి చెందిన ఎలంట్రాలో ఎకో మరియు స్పోర్ట్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లను అందించారు.

డిజైన్
డిజైన్ పరంగా మునుపటి ఎలంట్రా కన్నాపూర్తి విభిన్నంగా డిజైన్ చేసారు. అయితే ఇందులో హ్యుందాయ్ వారి ప్లూయిడిక్ డిజైన్ లక్షణాలు చాలా వరకు రాలేదని చెప్పవచ్చు.

ముందు వైపు డిజైన్
హ్యుందాయ్ ఎలంట్రా ముందు వైపు డిజైన్‌లో పదునుగా మరియు పొడవుగా ఉండే హెడ్ ల్యాంప్స్ కలవు, ఇందులోనే పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు కూడా ఉన్నాయి. మధ్యలో హెక్సాగోనల్ 5 స్లాట్ ఫ్రంట్ గ్రిల్ కలదు.

వెనుక వైపు డిజైన్
వెనుక వైపున స్వెఫ్ట్ బ్యాక్ టెయిల్ ల్యాంప్స్, ఈ లైట్లను మూడు విభిన్న సెగ్మెంట్లుగా గ్రాఫిక్స్ చేసి విభజించనట్లు ఉంటాయి. ఇక నాలుగు చక్రాలకు కూడా 16-అంగుళాల 10 స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు.

ఫీచర్లు
ఇంటీరియర్‌లో డ్యాష్ బోర్డ్‌ను డ్రైవర్ సీటుకు ప్రక్కన ఇచ్చారు. 8-అంగుళాల తాకే తెర పరిమాణం గల హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే లేదా ఆండ్రాయిడ్ ఆటో ఇందులో కలదు. మరియు బ్లూటూత్ కనెక్టివి కూడా కలదు. ముందు వైపున కూర్చున్న వారికి 10-వే పవర్ అడ్జస్టబులిటి ద్వారా గాలి అందే విధంగా వెంటిలేషన్ డిజైన్ చేశారు.

హ్యుందాయ్ ఎలంట్రా లభించు రంగులు
ఎలంట్రా మొత్తం ఐదు రంగుల్లో లభించును;



Click it and Unblock the Notifications








