కేవలం ఆరు వారాల్లో 1,100 బుకింగ్స్: హ్యుందాయ్ ఎలంట్రా
హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోని ప్రీమియమ్ సెడాన్ సెగ్మెంట్లోకి తమ సరికొత్త ఆరవ తరం ఎలంట్రా సెడాన్‌ను ఆగష్టు 2016 లో విడుదల చేసింది. అయితే విడుదలైన కేవలం ఆరు వారాల కాలంలో సుమారుగా 1,100 కార్ల బుకింగ్స్ అయ్యాయి. ఎలంట్రాను ఈ స్థాయిలో వినియోగదారుల నుండి స్పందన రావడం నిజంగానే రికార్డ్.

విడుదలైన ఆరు వారాల్లో సుమారుగా 18,000 మంది హ్యుందాయ్ డీలర్లను ఎలంట్రా గురించి సంప్రదించారు. ప్రస్తుతం హ్యుందాయ్ ఆరవ తరానికి చెందిన ఎలంట్రాను తమ ఫోర్ట్‌ఫోలియోలో అమ్మకాలను సిద్దంగా అందుబాటులో ఉంచింది.

కస్టమర్లు దీనిని సుమారుగా తొమ్మది వేరియంట్ల మధ్య ఎంచుకోవచ్చు.

ఆరవ తరానికి చెందిన ఎలంట్రాలో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండింటికి కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ప్రారంభ వేరియంట్ ధర రూ. 12.99 లక్షలు మరియు మరియు పూర్తి స్థాయిలో ఫీచర్లతో నిండిన ఎలంట్రా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 19.19 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

- ఆరవ తరానికి చెందిన హ్యుందాయ్ ఎలంట్రా విడుదల
- ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 25 కార్లు
- దీపాళికి కారు కొంటే వీటిని మాత్రమే ఎంచుకోండి, ఎందుకంటే ?
- మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ
- జపాన్ తొందర పాటు తనమా ? భారత్ వెనకబాటు తనమా...?



Click it and Unblock the Notifications








