ఇండియన్ మార్కెట్లోకి హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్ విడుదల

By Anil

కొరియన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి అందించిన మొదటి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20. ఇది అమ్మకాల పరంగా మంచి ఫలితాలనే సాధించింది. అయితే ఈ అమ్మకాల పరంపరను కొనసాగించడానికి ఎలైట్ ఐ20 లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను విడుదల చేసింది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

ఎలైట్ ఐ20 ఆటోమేటిక్ వర్షెన్‌ను 9.42 లక్షలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్ ధరతో భారతీయ విపణిలోకి విడుదల చేసింది. ఈ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్ వెర్షన్ కేవలం మ్యాగ్నా వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

హ్యుందాయ్ మోటార్స్ తమ ఆటోమేటిక్ వేరియంట్ పెట్రోల్ వెర్షన్ ఎలైట్ ఐ20 కారును మొదటి సారిగా 2016 ఇండోనేషియా మోటార్ షోలో ప్రదర్శించింది. అయితే అనుకున్న సమయానికన్నా ముందుగా మార్కెట్లోకి విడుదలైంది. వీటిని తమిళనాడులోని శ్రీపెరంబదూరులోని ప్లాంటులో హ్యుందాయ్ ఉత్పత్తి చేస్తోంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

ఆటోమేటిక్ ఎలైట్ ఐ20 కారులో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 98బిహెచ్‌పి పవ్ర మరియు 132ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

ఇందులోని ఇంజన్‌కు 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు. ఇందులో పరిచయం చేసిన ట్రాన్స్‌మిషన్‌ను హ్యుందాయ్ వెర్నా లో గమనించవచ్చు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

ప్రస్తుతం ప్రీమియ్ హ్యాచ్‌బ్యాక్‌లలో దీనికి పోటీగా ఉన్న హోండా జాజ్ మరియు మారుతి బాలెనొ లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. అయినప్పటికీ ఆ రెండింటితో పోల్చితే ఎలైట్ ఐ20 అమ్మకాలు అధికంగానే ఉన్నాయి.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల మ్యాగ్నాలో డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులతో పాటు ఇంజన్‌ ఇమ్మొబిలైజర్‌ను కూడా కలిగి ఉంది. ఎయుఎక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివి గల 2-డిఐఎన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో కలదు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

అయితే ఇందులో తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సస్టమ్, పగటి పూట వెలిగే లైట్లతో పాటు ఉన్న ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్‌లతో పాటు అత్యంత ముఖ్యమైన యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో రాలేదు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

దీనికి పోటీగా ఉన్న హోండా జాజ్ మరియు బాలెనొ లోని ఆటోమేటిక్ వేరియంట్లలో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను తప్పనిసరిగా అందించారు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

ధరల పరంగా పోల్చుకుంటే ఎలైట్ ఐ20 మ్యాగ్నా ధర రూ. 9.42 లక్షలు అదే విధంగా మారుతి బాలెనొ ధర రూ.7.29-7.93 లక్షలు మరియు హోండా జాజ్ ధర రూ. 7.69-8.62 లక్షలుగా ఉన్నాయి.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్

కారు ఇన్సూరెన్స్‌లో పాత విధానాన్ని ఫాలో అయితే నష్టపోయినట్లే..! మీ కోసం కొత్త విధానం

Article Published On: Saturday, September 10, 2016, 18:34 [IST]
English summary
Read In Telugu:Hyundai Elite I20 Automatic Launched India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+