అధిక వేరియంట్లు మరియు ఎయిర్ బ్యాగులతో అందుబాటులోకి హ్యుందాయ్ ఇయాన్

By Anil

కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచిన ఇయాన్ ఎంట్రీ లెవల్ కారును మరిన్ని వేరియంట్లు మరియు ఎయిర్ బ్యాగులతో అందుబాటులోకి తెచ్చింది. దాదాపుగా అన్ని వేరియంట్లలో కూడా డ్రైవర్ సైడ్ ఆప్షనల్ ఎయిర్ బ్యాగును అందిస్తోంది. అయితే ఇయాన్‌లోని డి-లైట్ ట్రిమ్ వేరియంట్లో ఇప్పటి వరకు ఈ డ్రైవర్ సైడ్ ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్ ఊసే లేదు.
Also Read: 17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ
మిగిలిన అన్ని వేరియంట్లలో కూడా డ్రైవర్ సైడ్ ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఇయాన్‍‌లో ఉన్న వేరియంట్లతో పాటు మరిన్ని పెరిగాయి. అందులో డి-లైట్, డి-లైట్ ప్లస్, ఎరా ప్లస్, మ్యాగ్నా ప్లస్, స్పోర్ట్జ్ మరియు మ్యాగ్నా ప్లస్ (ఒ) అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో స్పోర్డ్జ్ ట్రిమ్ వేరియంట్లో మాత్రమే ఆప్షనల్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ లభించేది.

హ్యుందాయ్ ఇయాన్

అప్షనల్ అందిస్తున్న డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగును ఎంచుకోవాలనుకుంటే మొత్తం ధరతో పాటు రూ. 10,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.0.8 లీటర్ మరియు 1.0 లీటర్ గల రెండు ఇంజన్ ఆప్షన్లలో కూడా ఈ డ్రైవర్ సైడ్ ఆప్షనల్ ఎయిర్ బ్యాగ్‌ను అందించారు. అయితే 1.0 లీటర్ ఇంజన్ కేవలం మ్యాగ్నా, మ్యాగ్నా ప్లస్ మరియు మ్యాగ్నా ప్లస్ (ఒ) ట్రిమ్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది.
హ్యుందాయ్ ఇయాన్

మారుతి సుజుకి తమ ఆల్టో 800 లో ప్రారంభ వేరియంట్ నుండి డ్రైవర్ సైడ్ ఆప్షనల్ ఎయిర్ బ్యాగును అందిస్తున్నారు. అదే విధంగా రెనో వారి క్విడ్‌లోని ఆర్‌ఎక్స్‌టి వేరియంట్లో మాత్రమే ఆప్షనల్ ఎయిర్ బ్యాక్‌ను కల్పించారు.
Article Published On: Monday, May 30, 2016, 12:46 [IST]
English summary
Hyundai Eon Available With More Variants & Optional Airbag
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+