క్లచ్ లోపం కారణంగా హ్యుందాయ్ ఇయాన్ రీకాల్
హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో తమ ఇయాన్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లను రీకాల్ చేసింది. క్లచ్ భాగంలో లోపం కారణంగా సుమారుగా 7,000 యూనిట్ల ఇయాన్‌లను రీకాల్ చేసినట్లు హ్యుందాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.

హ్యుందాయ్ రీకాల్ చేసిన మొత్తం 7,657 ఇయాన్‌లలో క్లచ్ వైర్‌కు బ్యాటరీ వైరు అనుసంధానమైపోయిందని తెలిసింది.

జనవరి 1, 2015 నుండి జనవరి 31, 2015 కాలం మధ్య ఉత్పత్తి అయిన యూనిట్లను రీకాల్ చేసినట్లు హ్యుందాయ్ తెలిపింది.

ఏవిధమైన అదనపు చార్జీలు లేకుండా ఉచితంగా ఈ సమస్యకు సంభందించిన సర్వీసును సంభందిత షోరూంలో చేస్తారని తెలిపారు.

ఈ సమస్యను గుర్తించడానికి హ్యుందాయ్ ఎప్పుడూ ఇయాన్ ఓనర్లతో టచ్‌లో ఉంటూ వచ్చింది. ఇయాన్ కార్లలో క్లచ్ భాగాన్ని పరీక్షించిన తరువాత క్లచ్ వైరు మరియు బ్యాటరీ వైరు తప్పుగా అనుసందానం చేసి ఉంటే వాటిని మార్పు చేయిస్తామని తెలిపింది.

హ్యుందాయ్ మోటార్స్ విడుదల చేసిన ప్రకటనలో నాణ్యమైన ఉత్పత్తులు మరియు సర్వీసును అందించడానికి హ్యుందాయ్ అన్ని విధాలా ముందుంటుందని, అందులో భాగంగానే కస్టమర్ల శ్రేయస్సు దృష్ట్యా ఇయాన్ లను రీకాల్ చేసినట్లు వివరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లు మరియు సర్వీస్ కేంద్రాల ద్వారా నిర్ణీత సమయంలో నాణ్యమైన సేవలు అందిస్తోందని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది.

- పాక్ ఉగ్ర స్థావరంపై మెరుపు దాడులు చేసిన ధృవ్ హెలికాప్టర్
- బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, విడుదల వివరాల కోసం


Click it and Unblock the Notifications








