హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ప్రత్యేక ఎడిషన్ విడుదల: ధర రూ. 5.69 లక్షలు
కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ తమ గ్రాండ్ ఐ10 కారు యొక్క 20 వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక ఎడిషన్‌గా గ్రాండ్ ఐ10 కారును విడుదల చేశారు. ఈ ప్రత్యేక ఎడిషన్ గ్రాండ్ ఐ10 కారు పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది.

- గ్రాండ్ ఐ10 స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ ధర రూ. 5.69 లక్షలు
- గ్రాండ్ ఐ10 స్పెషల్ ఎడిషన్ డీజల్ ధర రూ. 6.60 లక్షలు
- గ్రాండ్ ఐ10 స్పెషల్ ఎడిషన్ మెటాలిక్ పెట్రోల్ ధర రూ. 5.72 లక్షలు
- గ్రాండ్ ఐ10 స్పెషల్ ఎడిషన్ మెటాలిక్ డీజల్ ధర రూ. 6.64 లక్షలు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

హ్యుందాయ్ మోటార్స్ తమ గ్రాండ్ ఐ10 కారును 20 వ వార్షికోత్సవ ఎడిషన్ గా విడుదల చేయడానికి గ్రాండ్ ఐ10 లోని స్పోర్ట్స్ ట్రిమ్ లెవల్ లోని వేరియంట్‌ను వినియోగించారు.

20 వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసే విధంగా తెల్లటి రంగులో ఉన్న కారు యొక్క ప్రక్క మరియు వెనుక వైపున ప్రత్యేక గుర్తులు అందించారు.

స్పెషల్ ఎడిషన్ గ్రాండ్ ఐ10 లో సరికొత్త 6.2-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థ కలదు.

స్పెషల్ ఎడిషన్ గ్రాండ్ ఐ10 ఇంటీరియర్ మరియు అప్‌హోల్ట్సేను ఎరుపు మరియు తెలుపు రంగుల్లో డిజైన్ చేశారు.

ఉత్తమ కార్ల తయారీ సంస్థగా దూసుకెళ్తున్న హ్యుందాయ్ మోటార్స్ యొక్క మరిన్ని కథనాలు.....
ప్రపంచపు అత్యంత పొడవైన రైలు సొరంగం గురించి ఆసక్తికరమైన వివరాలు


Click it and Unblock the Notifications