అలర్ట్: 2017 నాటికి విడుదల కానున్న గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ ఇండియా వచ్చే ఏడాదిలో తమ 2017 గ్రాండ్ ఐ10 మోడల్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఈ మోడల్‌కు ఇప్పటికే పలుమార్లు పరీక్షలు నిర్వహించింది.

By Anil

భారత దేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ వచ్చే ఏడాదికి తమ 2017 గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది. ఫేస్‌లిఫ్ట్ రూపంలో పరిచయం అవుతున్న గ్రాండ్ ఐ10 జనవరి 2017 లో విడుదలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ ఈ మధ్యనే ఇంగ్లాడ్ మార్కెట్లో ఈ 2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్‌కు చెందిన కొన్ని చిత్రాలను కూడా విడుదల చేసింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

రహస్యంగా పరీక్షలకు గురైన మోడల్‌లో ఏవిధమైన అంశాలను గుర్తుపట్టడానికి వీల్లేకుండా నల్లటి లివరీ పెయింట్ ద్వారా కప్పేశారు. అత్యంత రహస్యంగా దీనికి పరీక్షలు నిర్వహిస్తోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

దేశీయంగా పరిచయం కానున్న గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ ఇంగ్లాండులో విడుదల కానున్న మోడల్‌ పోలికలతో రానుంది. ఇందులో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే లైట్లు, హెట్ లైట్లు మరియు నూతన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ లతో రానుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

స్పోర్టివ్ ఫాగ్ ల్యాంప్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ మరియు కనెక్టివిటీ ఫీచర్ల ఇందులో రానున్నాయి. ఇక టాప్ ఎండ్ వేరియంట్ మెరూన్ కలర్ తో బ్లాక్ లేదా నీలం రంగు కాంబినేషన్ గల రంగులతో పాటు లెథర్ అప్‌హోల్‌స్ట్రే‌తో రానుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

సాంకేతికంగా ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న కప్పా పెట్రోల్ ఇంజన్ మరియు 1.1-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల యు2 విజిటి ఆయిల్ బర్నర్ ఇంజన్‌లతో రానుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ 2017 జనవరిలో ఈ గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేస్తే ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఫిగో, షెవర్లే బీట్ మరియుటాటా టియాగో వంటి వాటికి పోటీగా నిలవనుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

  • తక్కువ బడ్జెట్లో యువతను ఊరిస్తోన్న స్పోర్ట్స్ బైకులు...
  • విమాన ఇంజన్ తో నడిచిన ప్రపంచపు మొదటి రైలు:
  • ఐ10 స్థానంలోకి సరికొత్త శాంట్రోను విడుదల చేయనున్న హ్యుందాయ్

More from DriveSpark

Article Published On: Saturday, November 19, 2016, 16:05 [IST]
English summary
Launch Alert: Hyundai Grand i10 In January 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+