హ్యుందాయ్ హెచ్‌ఎన్‌డి-10 కాన్సెప్ట్ ఎస్‌యువి
హ్యుందాయ్ మోటార్స్ ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేయనున్న మోడళ్లతో పాటు తమ భవిష్యత్తు కాన్సెప్ట్ వాహనాలను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. అందులో హ్యుందాయ్ మోటార్స్ వారి హెచ్ఎన్‌డి-14 కాన్సెప్ట్ ఎస్‌యువిని ప్రదర్శించింది.
హ్యుందాయ్ మోటార్స్ వారి ప్రదర్శించి వాహనాలన్నింటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెచ్‌ఎన్‌డి-14 ఎస్‌యువి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

కాన్సెప్ట్
హ్యుందాయ్ వారి హెచ్‌ఎన్‌డి-14 ఎస్‌యువి వాహనాన్ని తమ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారు ఆధారంతో రూపొందించారు. అయితే ఐ20 లోని రెండు ఇంజన్ లను కూడా ఇందులో వినియోగించనున్నారు.

పెట్రోల్ ఇంజన్
ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 82 బిహెచ్పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.

డీజల్ ఇంజన్
హెచ్‌ఎన్‌డి-14 కాన్సెప్ట్ కారులో డీజల్ ఇంజన్ కోసం హ్యుందాయ్ తమ ఐ20లో వినియోగించిన 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌ను ఉపయోగించనుంది. ఇది దాదాపుగా 89 బిహెచ్పి పవర్ మరియు 220 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్
రెండు ఇంజన్‌లు విడుదల చేస్ పవర్‌ను ముందు చక్రాలకు అందివ్వడానికి ఈ కాన్సెప్ట్ ఎస్‌యువి లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను వినియోగించనున్నారు.

డిజైన్
ముందు వైపున హ్యుందాయ్ ఫ్లూయిడిక్ 2.0 ఫిలాసఫి తో డిజైన్ చేశారు. ఇక వెనుకవైపున టెయిల్ ల్యాంప్స్‌ను చక్కటి ప్రదేశంలో అమర్చారు మరియు ప్రక్కవైపు డిజైన్ క్రెటా ను పోలి ఉంటుంది.

అందుబాటులోకి
హ్యుందాయ్ మోటార్స్ ఈ హెచ్‌ఎన్‌డి-14 కాన్సెప్ట్ ఎస్‌యువిని 2017 నుండి అందుబాటులోకి తీసుకురానున్నారు.

పోటి
ఈ ఎస్‌యువి మార్కెట్లోకి విడుదలఅయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా వారి టియువి300 మరియు ఫోర్డ్ వారి ఎకోస్పోర్ట్ వాహనాలకు పోటిగా నిలవనుంది.

హ్యుందాయ్ హెచ్‌ఎన్‌డి-14 ఎస్‌యువికి చెందిన మరిన్ని ఫోటోలు

Click it and Unblock the Notifications