భారీగా ధరలు పెంచిన హ్యుందాయ్: 2016 లోపు కోనుగోలు చేయడం బెటర్
హ్యుందాయ్ మోటార్స్ దేశీయంగా ఉన్న తమ కార్ల మీద ధరల పెంపును చేపట్టినట్లు స్పష్టం చేసింది. కొత్త ధరలు 2017 నుండి అమలుకానున్నాయి.
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ముగిసే నాటికిమ కార్ల తయారీ సంస్థలు ధరల పెంపును చేపట్టాయి. తయారీ మీద అధిక భారం కారణంగా ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు తమ లైనప్‌లో ఉన్న అన్ని ఉత్పత్తుల మీద ధరల పెంపును చేపట్టాయి. అందులో భాగంగానే హ్యుందాయ్ మోటార్స్ తమ వాహనాల మీద గరిష్టంగా లక్ష రుపాయల వరకు ధరలను పెంచినట్లు స్పష్టం చేసింది.

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ పెంచిన ధరలు 2017 జనవరి నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి వరకు వీటి మీద ఉన్న ఆఫర్లు మరియు డిస్కౌంట్లు యధావిధంగా అందుబాటులో ఉంటాయి.

హ్యుందాయ్ ఇండియా లైనప్‌లో ఉన్న ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన ఇయాన్ హ్యాచ్‌బ్యాక్ నుండి హ్యుందాయ్ వారి టాప్ ఎండ్ వేరియంట్ శాంటా ఫే తో పాటు తాజాగా విడుదల చేసిన టక్సన్ వరకు అన్నింటి మీద ధరలు పెంచింది.

అంతర్జాతీయ కరెన్సీతో రుపాయి విలువ మారకం రేటు మరియు పెట్టుబడి వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో ధరల పెంపును ప్రకటించినట్లు హ్యుందాయ్ సమర్థించుకుంది.

హ్యుందాయ్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాదిపత్యులు రాకేష్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, సవాళ్లతో కూడుకున్న ఈ ఏడాదిలో ధరల పెంపును దాదాపుగా పెంచలేదని తెలిపారు. అయితే ముడి సరుకులల ధరలు, ముడి పరికరాల దిగుమతులు, అంతర్జాతీయ కరెన్సీతో రుపాయి మారకంలో హెచ్చు తగ్గులు మరియు దేశీయంగా ప్రొడక్షన్ పరంగా పెట్టుబడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని ఆయన పేర్కొన్నారు.

ధరల సవరణ అనంతరం నూతన ధరలు 2017 జనవరి ప్రారంభం నుండి అమల్లోకి రానున్నాయి. తమ ఉత్పత్తుల మీద గరిష్టంగా లక్ష రుపాయల వరకు పెంపు ఉంటుందని హ్యుందాయ్ స్పష్టం చేసింది.

- ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
- మారుతి స్విఫ్ట్ డిజైర్ కు గట్టి పోటీని సిద్దం చేసిన షెవర్లే
- జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!


Click it and Unblock the Notifications