దీపావళి ఎఫెక్ట్: భారీగా ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించిన హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్స్ దీపావళి సందర్భంగా తమ ఉత్పత్తుల మీద గరిష్టంగా 2 లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది. అన్ని ఆఫర్లకు చివరి రోజు ఆక్టోబర్ 28, 2016. త్వరపడండి...
దీపావళి అనగానే అమ్మకాల్లో మరియు కొనుగోల్ల జోరు విపరీతంగా ఉంటుంది. తమ ఉత్పత్తులను భారీ స్థాయిలో అమ్ముకునేందు ఆఫర్లు డిస్కౌంట్లు, లాభాలు అనే వలలతో వేటకు సిద్దమయిపోతున్నాయి కొన్ని బడా సంస్థలు.

వాహన తయారీ సంస్థలు అయితే మరే సంస్థలు ప్రకటించలేని రీతిలో ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. అందులో హ్యుందాయ్ మోటార్స్ తమ ఉత్పత్తుల మీద గరిష్టంగా 2 లక్షల రుపాయల వరకు లాభాలను ప్రకటించింది.

హ్యుందాయ్ మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 మీద గరిష్టంగా 10,000 రుపాయల విలువైన ఆఫర్లను ప్రకటించింది.

ఎలైట్ ఐ20 లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద ఈ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నట్లు హ్యుందాయ్ తెలిపింది.

హ్యుందాయ్ తమ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్ల మీద ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్సెంట్ పెట్రోల్ వేరియంట్ మీద గరిష్టంగా 47,000 రుపాయలు మరియు ఎక్సెంట్ డీజల్ వేరియంట్ మీద గరష్టంగా 57,000 రుపాయల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ లోని ప్రారంభ వేరియంట్లు అయిన ఇయాన్ మరియు ఐ10 లలోని పెట్రోల్ మోడళ్ల మీద మాత్రమే దీపావళి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించింది.

హ్యుందాయ్ ఐ10 పెట్రోల్ వేరియంట్ మీద గరిష్టంగా 53,000 రుపాయలు మరియు ఇయాన్ లోని పెట్రోల్ వేరియంట్ల మీద గరిష్టంగా 60,000 రుపాయల వరకు ఆఫర్లు అందుబాటులో ఉంచింది.

దీపావళి సందర్భంగా వెర్నా మీద లక్ష రుపాయలు మరియు శాంటాఫి ఎస్‌యువి మీద గరిష్టంగా 2 లక్షల రుపాయల ఆఫర్లను అందుబాటులో ఉంచింది.

ఇక హ్యుందాయ్ శ్రేణిలో ఉన్న వాహనాల మీద చేసే ప్రతి టెస్ట్ డ్రైవ్ మీద తప్పనిసరిగా క్రికెట్‌కు చెందిన ఏదో ఒక వస్తువుని బహుమతిగా అందివ్వనున్నారు.

అంతే కాకుండా ప్రతి హ్యుందాయ్ కారు కొనుగోలు మీద తప్పనిసరిగా ఒక క్రికెట్ కిట్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. అన్ని ఆఫర్లకు చివరి తేదీ అక్టోబర్ 28, 2016గా. దేశ వ్యాప్తంగా ఉన్న హ్యందాయ్ డీలర్ల వద్ద అన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

- నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీలో కొత్త ట్విస్ట్
- పగలు మరియు రాత్రుల్లో దుర్గా పూజ సంభరాల క్షణాలు ! మీరు చూడటానికి సాధ్యపడనివి


Click it and Unblock the Notifications








