సరికొత్త గ్రాండ్ ఐ10, ఎక్సెంట్ మరియు వెర్నా విడుదల వివరాలు
హ్యుందాయ్ తమ లైనప్‌లో ఉన్న గ్రాండ్ ఐ10, ఎక్సెంట్ మరియు వెర్నాలను సరికొత్త అప్‌డేట్లతో అదే విధంగా కొన్ని సాంకేతిక మార్పులతో 2017 నాటికి విడుదల చేయనుంది.
హ్యుందాయ్ మోటార్స్ 2017 నాటికి ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ ఐ10, ఎక్సెంట్ మరియు 2017 వెర్నా మిల్డ్ హైబ్రిడ్ సెడాన్‌ను విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. ప్రీమియమ్ ఎస్‌యువి మరియు సెడాన్ సెగ్మెంట్లలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఈ రెండు సెగ్మెంట్లలోకి 2016 ను వేదిక చేసుకుని టుసాన్ ఎస్‌యువి మరియు ఎలంట్రా లను విడుదల చేసింది.

ఫీచర్లు, సాంకేతిక మరియు ఇంటీరియర్ అప్‌డేట్స్‌తో విడుదలకు సిద్దమైన 2017 ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ ఐ10, ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ మరియు 2017 వెర్నా హైబ్రిడ్‌ల గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం.

ఫేస్‌లిఫ్టెడ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాదిలో జరిగిన 2016 ప్యారిస్ మోటార్ షో వాహన ప్రదర్శన వేదిక మీద ఫేస్‌లిఫ్టెడ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను ప్రదర్శించింది. అయితే దేశీయ విపణిలోకి 2017 జనవరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో గ్రాండ్ 10 మంచి విజయాన్ని అందుకుంది అయితే దీనికి అప్‌డేటెడ్ వర్షెన్‌గా వస్తోన ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లో సరికొత్త ఫ్రంట్ బంపర్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, సరికొత్త డిజైన్‌లో అల్లాయ్ వీల్స్, నూతన స్పయిలర్ మరియు వెనుక వైపున అప్‌డేటెడ్ డిజైన్ విండో కలదు.

ఫేస్‌లిఫ్టెడ్ గ్రాండ్ ఐ10 లోని ఇంటీరియర్‌లో సరికొత్త అప్‌హోల్‌స్ట్రే, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్ సిస్టమ్ వంటివి రానున్నాయి.

ఈ అధునాతన గ్రాండ్ ఐ10 లో మెకానికల్ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనిని హ్యుందాయ్ స్పష్టం చేయాల్సి ఉంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్
హ్యుందాయ్ మోటార్స్ తమ కాంపాక్ట్ సెడాన్ ఎక్సెంట్‌ను తొలిసారిగా లో విడుదల చేసింది వ్యక్తిగత అవసరాల కన్నా వ్యాపార అవసరాలకు ఎక్కువగా ఎంచుకోవడం జరిగింది. దీనిని ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ 10 ఫీచర్లతో వ్యక్తిగత విక్రయాలను టార్గెట్ చేస్తూ మార్చి 2017 నాటికి విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం కాంపాక్ట్ సెడాన్‌లలో పొడవు తక్కువగా ఉన్నా వాటినే క్యాబ్‌లుగా ఎంచుకుంటున్నారు. దీని వలన సొంత అవసరాలకు కొనుగోలు చేసే వారు ఎక్సెంట్ ను ఎంచుకోవడానికి వెనకడుగేస్తున్నారు. ఈ ధోరణి మార్చేందుకు దీని మరింత పొడవుగా ప్రీమియ్ లుక్‌తో విడుదల చేయనుంది హ్యుందాయ్.

2017 హ్యుందాయ్ వెర్నా
వచ్చే ఏడాదిలో హ్యుందాయ్ ప్రవేశపెట్టనున్న మరో ఉత్పత్తి వెర్నా. 2017 జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సెడాన్‌లతో పోల్చుకుంటే భారీ పరిమాణంలో ఉండేటటువంటి 2017 వెర్నాను 2016 చెంగ్డు అంతర్జాతీయ వాహన ప్రదర్శన వేదిక మీద బహిర్గతం చేసింది.

2016 లో విడుదలైన ఆరవ తరానికి చెందిన ఎలంట్రాలోని డిజైన్ లక్షణాలతో 2017 వెర్నాలో మెరుగులు దిద్దడం జరిగింది. ఫీచర్ల పరంగా ఇందులో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

చైనాలోని చెంగ్డులో ప్రదర్శించబడిన 2017 వెర్నాలో 99బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ పెట్రోల్ మరియు 121బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌లతో పరిచయం అయ్యింది.

ప్రస్తుతం దేశీయంగా హ్యుందాయ్ లైనప్‌లో ఉన్న 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో పాటు 2017 వెర్నాలో ఇదే సామర్థ్యం ఉన్న రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లు రానున్నాయి.

హ్యుందాయ్ ఈ 2017 వెర్నాలో మిల్డ్ హైబ్రిడ్ పరిజ్ఞానం గల డీజల్ వేరియంట్‌ను పరిచయం చేయడానికి ఎంతో ఉత్సుకతతో ఉంది. ఇందులోని డీజల్ ఇంజన్‌కు అదనంగా ఎలక్ట్రిక్ మోటార్ కూడా పనిచేస్తుంది. తద్వారా తక్కువ డీజల్ వినియోగంతో అదే పవర్‌తో పాటు ఎక్కువ మైలేజ్ ఇవ్వగలదు.

మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‌లో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి (SHVS) అనే హైబ్రిడ్ పరిజ్ఞానంతో అందుబాటులో ఉంచింది. హైబ్రిడ్ సెడాన్‌లలో ఉన్న ఏకైక మోడల్ సియాజ్ కు 2017 వెర్నా హైబ్రిడ్ గట్టి పోటీనివ్వనుంది.

ఇండియాలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలను వేగంగా అభివృద్ది మరియు ఉత్పత్తి (FAME) స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల ధరలలో రాయితీ కల్పిస్తోంది. తద్వారా 2017 వెర్నా హైబ్రిడ్ ధర తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా కొనుగోలుదారులకు మరియు పరోక్షంగా విక్రయదారులకు లబ్ధిచేకూర్చనుంది.

- బజాజ్ డొమైనర్ 400 కు పోటీని సిద్దం చేసిన టీవీఎస్: విడుదల తేదీ కూడా ఖరారు
- మారుతి వ్యాగన్ఆర్ ఫెలిసిటి లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు
- టైర్లు ఎందుకు పేళుతాయి, టైర్ల పేలడాన్ని ఎలా నిరోధించాలి మరియు వాటి నిర్వహణ ఏలా చేయాలి ?


Click it and Unblock the Notifications








