ప్రియస్ మీద ఆధిపత్య పోరుకు సిద్దమైన హ్యుందాయ్ ఇయానిక్
ఇండియన్ మార్కెట్లోకి టయోటా మోటార్స్ ఒకానొక కాలంలోనే ప్రియస్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేసింది. అయితే దీని మీద ఆధిపత్యపోరుకు చాలా వరకు కార్ల తయారీ సంస్థలు ఒక కొత్త ఉత్పత్తిని అభివృద్ది చేసుకుంటున్నాయి. అందులో ఒకటి హ్యుందాయ్.

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ టయోటా ప్రియస్‌కు పోటీగా ఇయానిక్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

హ్యందాయ్ మోటార్స్ విడుదల చేయనున్న ఇయానిక్ కారును హైబ్రిడ్, ప్యూర్ ఎలక్ట్రిక్ మరియు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అనే వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానం చేయనుంది.

ప్రపంచ హైబ్రిడ్ కార్ల సెగ్మెంట్లో అపజయం ఎరుగని ఉత్పత్తి టయోటా వారి ప్రియస్. ఇందులోని ఉన్న అద్బుతమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ప్రియస్ లోని పరిజ్ఞానాన్ని కాపీ కొట్టి మరీ ఈ హ్యుందాయ్ ఇయాన్ అందుబాటులోకి వస్తోంది అనే వాదనలు కూడా ఉన్నాయి.

బ్రిటన్‌లో అక్టోబర్ 2016 లో విడుదల కావడానికి సిద్దమయ్యింది ఈ హ్యుందాయ్ ఇయానిక్. హ్యుందాయ్ దీనిని 2.0 ప్ల్యూయిడిక్ స్కల్పచర్ డిజైన్ భాషలో రూపొందించింది.

అచ్చం ప్రియస్ ను పోలిన తరహాలో హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, వర్టికల్ సి-ఆకారపు ఎల్‌ఇడి పగటి పూట వెలిగే లైటు, ఈ సరికొత్త ఇయానిక్‌కు ఆభరణాలుగా మారాయి అని చెప్పవచ్చు.

హ్యుందాయ్ ఈ ఇయానిక్ సెడాన్ ఇంటీరియర్‌ను పర్యావరణ అనుకూలమైన పదార్థంతో అభివృద్ది చేయడం జరిగింది.

- ఐదు డోర్ల ఫియస్టాను విడుదల చేసిన ఫోర్డ్
- అన్ని ఉత్పత్తుల మీద లక్ష రుపాయల వరకు తగ్గింపు
- కొత్త అప్‌డేట్స్‌తో విడుదలైన ఎటియోస్ లివా లోని కొత్తదనం


Click it and Unblock the Notifications








