భాగ్యనగరంలో నాలుగు నూతన షోరూమ్‌లను అందుబాటులోకి తెచ్చిన హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్స్ హైదరాబాద్ మహానగరంలో నాలుగు హ్యుందాయ్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను ఏప్రిల్ 20, 2016 న ప్రారంభించింది. తెలంగాణ ప్రాంత పరిధిలో ఇపుడు మొత్త 12 షోరూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా దక్షిణ భారతదేశంలో మొదటి డిజిటల్ ఔట్‌లెట్‌ను కూడా ప్రారంభించింది కొరియాకు చెందిన ఈ ఆటోమొబైల్ తయారీ సంస్థ.

నాలుగు షోరూమ్‌లు కూడా హ్యుందాయ్ వారి గ్లోబల్ డీలర్‌షిప్ స్పేస్ ఐడెంటిటి ఆధ్వర్యంలో ఉంటాయి. త్వరలో ఈ నాలుగు షోరూమ్‌లలో హ్యుందాయ్ వారి విసృత స్థాయి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. మరియు వీటికి చెందిన టెస్ట్ డ్రైవ్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

తల్వార్ హ్యుందాయ్: హౌస్ నెం. 8/2/293/82/A/701 మరియు 701 లలో కలదు. ఇది రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్‌లో కలదు. ఇక్కడ ఉన్న షోరూమ్ 6,912 చదరపు అడుగులు మరియు 27,391 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్క్‌షాప్ కలదు.

ఫ్యూసన్ హ్యుందాయ్: సర్వే నెం. 33, బోయన పల్లి చెక్ పోస్ట్‌కు దగ్గరలో, జాతీయ రహదారి 7 మీద ఉన్న మేడ్చల్, సింకింద్రబాద్, తెలంగాణలో ఈ షోరూమ్ కలదు.

కున్ యునైటెడ్ కార్ ట్రాక్స్ లిమిటెడ్: ఈ షోరూమ్ హైదరాబాద్‌లోని లకడికపూల్‌లో ఉన్న ఎసి గార్డ్స్, 11-4-649/A అడ్రస్‌లో కలదు.

సబూ హ్యుంద్యాయ్: దక్షిణ భారత దేశంలో మొదటి డిజిటల్ షోరూమ్ ఇది. ఈ షోరూమ్ A2, మోతి వ్యాలి, మహవీర్ టవర్స్, తిరుమలగిరి, సింకింద్రాబాద్‌లో కలదు. ఈ షోరూమ్ 4,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో కలదు.

శిథిలమైన నానో జీవితం: ఊహించిన చిత్రాలతో టాటా నానో ప్లాంట్
సముద్రగర్బంలో పరుగులుపెట్టనున్న భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు
విమానాన్ని టార్గెట్ చేసిన డ్రోన్


Click it and Unblock the Notifications








