70 లక్షల కార్లతో రికార్డు సృష్టించిన హ్యుందాయ్ మోటార్స్
హ్యుందాయ్ మోటార్స్ చెన్నైలోని తమ ప్రొడక్షన్ ప్లాంటులో 70 లక్షల "వ" కారును ఉత్పత్తి చేసింది. దేశీయంగా అత్యధిక విక్రయాలు జరుపుతున్న వాటిలో రెండవ స్థానంలో హ్యుందాయ్ నిలిచింది.
భారత దేశపు రెండవ అతి పెద్ద దిగ్గజ కార్ల తయారీ సంస్థగా హ్యుందాయ్ మరో సారి నిరూపించుకుంది. దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏకంగా 70 లక్షల కార్లను ఉత్పత్తి చేసి తన సత్తాను చాటుకుంది.

హ్యుందాయ్ మోటార్స్ దేశీయంగా ఉత్పత్తిన చేసిన కార్ల సంఖ్య 70 లక్షలకు చేరింది. 70 లక్షల స్థానంలో క్రెటా చోటు సంపాదించింది.

నవంబర్ 21, 2016 న తమిళనాడులో చెన్నైకి సమీపంలో ఉన్న శ్రీపెరంబదూరు ప్రొడక్షన్ ప్లాంటులో ఈ క్రెటా ఎస్‌యువిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.కె. కూ మరియు ప్రొడక్షన్ హెడ్ గణేశ్ మణి పాల్గొన్నారు.

హ్యుందాయ్ మోటార్స్ ప్రస్తుతం దేశీయ అమ్మకాల్లో రెండవ స్థానంలో మరియు ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది.

ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే 70 లక్షల కార్లను ఉత్పత్తి చేసిన ఘనత హ్యందాయ్ కి మాత్రమే తగ్గింది. ఇప్పటి వరకు కేవలం 18 ఏళ్లలో ఈ విధమైన ఉత్పత్తిని ఏ సంస్థ అందుకోలేకపోయింది.

అంటే హ్యుందాయ్ మోటార్స్ సరిగ్గా ప్రతి 18 నెలలకు 10 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ తరహా వేగం మరే సంస్థల్లోనూ లేదు.

1998 లో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించిన హ్యుందాయ్ మోటార్స్ సరిగ్గా ఎనిమిదేళ్ల తరువాత 2006 లో తమ పది లక్షల (వ) ఉత్పత్తి శాంట్రోని విడుదల చేసింది.

8 ఏళ్ల సమయం కాస్త కేవలం 18 - 19 నెలల్లోపే పది లక్షల ఉత్పత్తి దశకు చేరుకుంది హ్యుందాయ్.

ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా అందుబాటులో ఉంచిన ఉత్పత్తులు
- హ్యుందాయ్ ఇయాన్
- హ్యుందాయ్ ఐ10
- హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
- హ్యుందాయ్ ఎక్సెంట్
- హ్యుందాయ్ ఎలైట్ ఐ20
- హ్యుందాయ్ ఐ20 ఆక్టివ్
- హ్యుందాయ్ వెర్నా 4ఎస్ ఫ్లూయిడిక్ వెర్నా
- హ్యుందాయ్ ఎలంట్రా
- హ్యుందాయ్ క్రెటా
- హ్యుందాయ్ శాంటా ఫె (ప్రస్తుతం ఈ మోడల్‌ను దిగుమతి చేసుకుంటోంది)
- హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యువి (తాజాగ విడుదలైంది)
- టాటా కైట్ 5 కోసం ఎంపిక చేసిన వియాగో మరియు ఆల్టిగో లలో ఏ పేరు బాగుంది..?
- కారును కొనుగోలు చేసే మంచి తరుణం: సున్నా డౌన్ పేమెంట్ తో మారుతి కార్లు
- అలర్ట్: 2017 నాటికి విడుదల కానున్న గ్రాండ్ ఐ10




Click it and Unblock the Notifications








