లగ్జరీ సెడాన్ కారును ఆవిష్కరించిన హ్యుందాయ్ మోటార్స్
హ్యుందాయ్ మోటార్స్ సంస్థ తన జి90 ప్రీమియమ్ లగ్జరీ సెడాన్ కారును ఆవిష్కరించింది. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారు మీద ప్రతీకారం కోసం అమెరికా మార్కెట్లోకి దీనిని అందించింనుంది.

లగ్జరీ కార్లలో ఉండే ప్రతి ఫీచర్ కూడా ఇందులో మీరు గమనించవచ్చు. ఇది రెండు ఇంజన్ ఆఫర్లలతో అందుబాటులో ఉండనుంది. అందులో 3.3-లీటర్ ట్విన్ టర్బో వి6 మరియు 5.0-లీటర్ కెపాసిటి గల వి8 డైరెక్ట్ ఇంజెక్టెడ్ ఇంజన్‌లను కలిగి ఉంది. అయితే ఈ రెండు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులోకి రానున్నాయి.
సాధారణ జెనిసెస్ కారుతో పాల్చితే, ఈ జి90 స్పోర్ట్ లగ్జరీ కారులో ఇన్ఫోటైన్‌మెంట్ సెంటర్ కన్సోల్, అత్భుతమైన ఇంటీరియర్ మొత్తంగా చెప్పాలంటే ఇది ఫ్ల్యాగ్ షిప్ లగ్జరీ సెడాన్ తరహాలో ఉంటుంది. ఇంకా ఇందులో లేన్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, పెడస్ట్రేన్ డిటెక్షన్, డైనమిక్ బెండింగ్ హెడ్ ల్యాంప్స్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్ వంటి ఫీచర్లు ఎన్నో ఇందులో కలవు.
మెర్సిడెస్ బెంజ్ ఎస్550 కారుతో పోల్చితే ఇది ఎంతో ధృడంగా ఉంటుంది. మరియు ముందు వైపున గల ఇంజన్ రియర్ వీల్ డ్రైవ్ ను కలగిన హ్యుందాయ్ జి90 లగ్జరీ కారు డ్రైవర్‌కు మంచి అనుభూతిని ఇస్తుంది.


Click it and Unblock the Notifications




























