చికాగో ఆటో షోలో హ్యుందాయ్ వారి స్యాంటా ఫీ ఆవిష్కరణ
హ్యుందాయ్ మోటర్స్ చికాగో ఆటో షోలో రెండు భారీ ఫీచర్లు గల కార్లను ప్రదర్శించింది. అందులో స్యాంటా ఫి మరియు స్యాంటా ఫి స్పోర్ట్. వీటికి చెందిన మరిన్ని ఫోటోలు తిలకించడానికి క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

స్యాంటా ఫి సాంకేతిక వివరాలు:
హ్యుందాయ్ వారి స్యాంటా ఫి స్పోర్ట్ వేరియంట్ 182 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.4-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇంజన్ లేదా అత్యంత శక్తివంతమైన 2.0-లీటర్ కెపాసిటి గల టర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల ఇంజన్‌తో రానుంది. ఇది దాదాపుగా 237 బిహెచ్‌పి పవర్‌మను ఉత్పత్తి చేస్తుంది. స్యాంటా ఫి లో 286 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేసే 3.3-లీటర్ కెపాసిటి గల వి6 ఇంజన్ కలదు. ఇవి రెండు కూడా 6-స్పీడ్ ఆటోమేటిక్ గల గేర్ బాక్స్‌తో పవర్‌ను అన్ని చక్రాలకు సరఫరా చేయును.
మరింత చదవండి: రెనో డస్టర్ ప్రేమికులకు శుభవార్త
స్యాంటా ఫి ఫీచర్లు:
స్యాంటా ఫి వాహనంలో ఆరు లేదా ఏడు మంది ప్రయాణించే మరియు స్పోర్ట్ వాహనంలో ఐదు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఇక ఫీచర్లు విషయానికి వస్తే ముందు వైపున అప్‌గ్రేడెడ్ ఎల్ఇడి ల్యాంప్స్, ఇన్ఫోటైన్‌మెంట్, సేఫ్టీ గేర్స్, సరికొత్త డ్రైవ్ మోడ్స్ ఇందులో కల్పించారు.
మరింత చదవండి: బ్రిజా ముందు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఆటలు ఇక మీదట సాగవు
ధర వివరాలు:
స్యాంటా ఫి ధరలు దాదాపుగా రూ. 17 నుండి 20 లక్షల మధ్య ఉండవచ్చు. మరియు ఈ ఏడాది చివరికి ఇవి మన దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications























