హ్యుందాయ్ శాంట్రోను తిరిగి విడుదల చేయడం వెనకున్న కారణాలేంటి...?

హ్యుందాయ్ మోటార్స్ గత ఏడాది తమ మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ శాంట్రోను మార్కెట్ నుండి తొలగిచింది. అయితే తిరిగి తమ శాంట్రోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

By Anil

హ్యుందాయ్ మోటార్స్ యొక్క విజయ చరిత్ర 1998 లో శాంట్రో ద్వారా మొదలయ్యింది. మారుతి ఆల్టో జపం చేస్తున్న మార్కెట్ వర్గాలను షాక్ కు గురిచేస్తూ హ్యుందాయ్ తమ శాంట్రోను అప్పట్లో మార్కెట్లోకి విడుదల చేసింది.

హ్యుందాయ్ శాంట్రో

సరిగ్గా 16 సంవత్సరాల అనంతరం 19 లక్షల అమ్మకాల తరువాత శాంట్రో హ్యాచ్‌బ్యాక్‌ను నవంబర్ 2015 న ఇండియన్ మార్కెట్ నుండి తొలగించింది.

హ్యుందాయ్ శాంట్రో

దేశీయ మార్కెట్లోకి ఫోర్డ్, జనరల్ మోటార్స్ వంటి సంస్థలు తమ సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తులను పరిచయం చేస్తున్న తరుణంలో హ్యుందాయ్ తమ శాంట్రోని పరిచయం చేసింది.

హ్యుందాయ్ శాంట్రో

చాలా మంది మార్గెట్ నిపుణులు శాంట్రో ప్రభావం భారతీయులపై అంతగా ఉండదని భావించారు. అయితే కేవలం 3 లక్షల ధరతో భారతీయ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుని అమ్మకాల సునామీ సృష్టించింది.

హ్యుందాయ్ శాంట్రో

అంతే కాదండోయ్, గత ఏడాది శాంట్రోని మార్కెట్ నుండి తొలగిస్తున్న తరుణంలో కూడా నెలకు 2,000 కార్ల విక్రయాలు నమోదయ్యేవి అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆటోమొబైల్ వార్తా వేదికల ప్రకారం హ్యుందాయ్ తిరిగిన తమ శాంట్రోను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.

హ్యుందాయ్ శాంట్రో

అయితే హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ శాంట్రో ను మళ్లీ విడుదల చేయడానికి ఉన్న కారణాలు ఏంటో తెలుసా...? వాటి గురించి పూర్తి వివరాలు ఇదే కథనంలో తెలుసుకుందాం రండి.

1. ధరకు తగ్గ విలువలతో...

1. ధరకు తగ్గ విలువలతో...

1998 లో విడుదలైన శాంట్రో మాత్రమే అప్పట్లో డబ్బుకు తగ్గ విలువైన కారు. దీనికి పోటీగా ఉన్న మరే ఉత్పత్తుల్లో కూడా ఇందులో ఉన్నన్ని ఫీచర్లు ఉండేవి కావు. ఈ కారణాల చేత అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. కాబట్టి ఇండియన్ కస్టమర్లను మళ్లీ ఆకట్టుకోవడం హ్యుందాయ్‌కి పెద్దగా కష్టమేమీ కాదు.

2. అత్యుత్తమ ఎంట్రీ లెవల్ కారు

2. అత్యుత్తమ ఎంట్రీ లెవల్ కారు

శాంట్రో మార్కెట్ నుండి వెలివేయబడ్డాక ఉన్న ఏకైక ఎంట్రీ లెవల్ కారు ఇయాన్. అయితే శాంట్రో స్థాయిలో అమ్మకాలు ఇయాన్ ద్వారా కుదరడం లేదు. అయితే ఇయాన్ పై స్థానంలో ఉన్న గ్రాండ్ ఐ10 మంచి అమ్మకాలు సాధిస్తోంది. కాబట్టి ఎంట్రీ లెవల్ ఉత్పత్తి మంచి అమ్మకాలు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

3. యువ కస్టమర్ల కోసం...

3. యువ కస్టమర్ల కోసం...

నిజమే , ప్రస్తుతం యువ మరియు కొత్త కారును కొనుగోలు చేసే వారు అత్యంత నాణ్యమైన మరియు నమ్మకమైన ఎంట్రీ లెవల్ కార్ల మీద దృష్టి సారిస్తున్నారు. ఈ తరుణంలో మంచి సక్సెస్ స్టోరీ ఉన్న శాంట్రో రీ లాంచ్ ద్వారా కొత్త డిజైన్, ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన ధరతో విడుదలయితే మంచి విజయం ఖాయం.

4. ఎస్‌యువి డిజైన్ శైలిలో

4. ఎస్‌యువి డిజైన్ శైలిలో

హ్యుందాయ్ శాంట్రో మొదటి నుండి అదే టాల్ బాయ్ బాడీ డిజైన్‌తో కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎస్‌యువి తరహాలో ఉన్న ఎంట్రీ లెవల్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి హ్యుందాయ్ శాంట్రో రీలాంచ్ అయితే మంచి విజయం ఖాయం.

5. క్రాసోవర్ శైలిలో...

5. క్రాసోవర్ శైలిలో...

హ్యుందాయ్ మోటార్స్ శాంట్రోని క్రాసోవర్ శైలిలో విడుదల చేస్తే రెనో క్విడ్ తరహాలో విజయం హ్యుందాయ్‌కు గ్యారంటీ అని చెప్పవచ్చు.

హ్యుందాయ్ శాంట్రో

  • చేతక్ స్కూటర్ ను మళ్లీ విడుదల చేయనున్న బజాజ్
  • సుజుకి స్కూటర్ మరియు బైకుల ధరల సవరణ: కొత్త ధరల కోసం క్లిక్ చేయండి
  • అంద, చెంద మార్పులతో 2018 నాటికి సరికొత్తగా విడుదలవుతోంది

Most Read Articles

English summary
Why Should Hyundai Bring Back The Santro To India? Here Are The Reasons
Story first published: Thursday, November 24, 2016, 18:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X