దేశీయంగా టుసాన్ బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్ ఇండియా
హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఈ ఏడాదిలో విడుదల చేయనున్న రెండవ ఉత్పత్తి యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. మొదటి ఉత్పత్తి అయిన ఎలంట్రా ప్రీమియమ్ సెడాన్ ఈ ఏడాదిలోనే విడుదల చేసింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని ఎంచుకోదగ్గ షోరూమ్‌లలో వీటి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

సమాచార విభాగం తెలిపిన వివరాల మేరకు, వినియోగదారులు 25,000 రుపాయల ప్రారంభ ధరతో టుసాన్ ఎస్‌యువిని బుకింగ్ చేసుకోవచ్చని కొంత మంది డీలర్లు అనధికారికంగా ప్రకటించారు.

టుసాన్‌ను ఎంచుకోవాలనుకునే ఔత్సాహికలు డీలర్ల వద్ద ఉన్న మోడల్‌ను చూడవచ్చు అయితే టెస్ట్ డ్రైవ్‌కు అనుమతించడం లేదు.

హ్యుందాయ్ మోటార్స్ ఈ టుసాన్ ఎస్‌యువిని అక్టోబర్ 24, 2016 న మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంది. అయితే అనుకోకుండా దీని విడుదలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం..

హ్యుందాయ్ మోటార్స్ ఇప్పటికే కొన్ని టుసాన్ ఎస్‌యువిలను దిగుమతి చేసుకుని పరీక్షలు నిర్వహిస్తోంది మరికొన్నింటిని పెద్ద పెద్ద నగరాలలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం విడుదలకు సిద్దమైన టుసాన్ భారతీయులకు కొత్తేమీ కాదు, ఇంతకు ముందు హ్యుందాయ్ దేశీయంగా మొదటి టుసాన్‌ను విడుదల చేసింది. అయితే ఐదేళ్ల క్రితం మార్కెట్ నుండి తొలగించింది.

హ్యుందాయ్ మోటార్స్ ఈ కొత్త తరం టుసాన్ ఎస్‍యువిని పదునైన డిజైన్‌లో మరియు సమకాలీన శైలిలో అభివృద్ది చేసింది.

టుసాన్ లోని డీజల్ వేరియంట్ కోసం హ్యుందాయ్ అంతర్జాతీయంగా అందుబాటులో ఉంచిన టుసాన్ లోని డీజల్ ఇంజన్‌ను ఇందులో అందివ్వనుంది.

2.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ సుమారుగా 183బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ టుసాన్ దేశీయంగా విడుదలైతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిఆర్-వి మరియు స్కోడా యెటి వంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది.

హ్యుందాయ్ లైనప్‌లో ఉన్న క్రెటా మరియు శాంటా ఫె మోడళ్ల మధ్య స్థానంలో ఉండనుంది. ఇది 17 నుండి 25 లక్షల మధ్య ధరతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

- జపాన్ తొందర పాటు తనమా ? భారత్ వెనకబాటు తనమా...?
- మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ


Click it and Unblock the Notifications








