ఈ ఏడాదిలోనే విడుదల కానున్న హ్యుందాయ్ టుసాన్
హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ తాజాగా ఎస్‌యువి వాహనం టుసాన్‌ను ప్రదర్శించింది. అయితే టుసాన్ ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి అందుబాటులోకి విడుదల కానున్నట్లు సమాచారం. హ్యుందాయ్ మోటార్స్ తమ క్రెటా మరియు శాంటా ఫె మోడల్స్‌ను అభివృద్ది చేసిన వేదక మీదనే ఈ సరికొత్త టుసాన్ ఎస్‌యువి ని అభివృద్ది చేసినట్లు తెలిసింది.

హ్యుందాయ్ టుసాన్ ఎస్‌విలో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌తో రానుంది.

ఇందులోని ఇంజన్ సుమరుగా 175 బిహెచ్‌పి పవర్ మరియు 195 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేసారు.

హ్యుందాయ్ మోటార్స్ ఇండయన్ మార్కెట్లోకి ఈ టుసాన్‌ను విడుదల చేస్తే హోండా సిఆర్-వి, షెవర్లే ట్రయల్‌బ్లేజర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి ఎస్‌యువిలకు పోటీగా నిలవనుంది.

ఈ టుసాన్ ధర విషయంలో కూడా దీనికి పోటిగా ఉన్న వాహనాలతో పోటీ పడనుంది. ఒక అంచనాగా చూస్తే ఇది సుమారుగా 17.5 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉండవచ్చు.

హ్యుందాయ్ మోటార్స్ దీనిని సరైన ధరతో అందుబాటులోకి తీసుకువస్తే క్రెటా వాహనంలా మంచి ఆదరణ పొందుతుంది.

హ్యుందాయ్ ఈ టుసాన్ ఎస్‌యువిలో పెట్రోల్ ఇంజన్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు చెందిన వివరాలను ఇంకా వెల్లడించలేదు.

హ్యుందాయ్ టుసాన్‌కు చెందిన మరిన్ని వివరాలు కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి. మరిన్ని హ్యుందాయ్ వాహనాల గురించి తెలుసుకోండి.

కన్నుల నిండా కనువిందు చేసిన కత్రినా కైఫ్
ప్రపంచ మార్గనిర్దేశకం ఇండియన్ ఇస్రో గురించి 20 ముఖ్య విషయాలు


Click it and Unblock the Notifications