పండుగ సీజన్‌లో విడుదలకు సిద్దమవుతున్న హ్యుందాయ్ టుసాన్
హ్యుందాయ్ మోటార్స్ ఇండియాలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ టుసాన్ ఎస్‌యువిని ప్రదర్శించింది. కొరియా ఆధారిత కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఎస్‌యువిని ఈ ఏడాది పండుగ సీజన్‌కు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న శాంటా ఫి మరియు క్రెటా ఎస్‌యువి మధ్య స్థానంలో దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టుసాన్ ఎస్‌యువిలో 2.0 లీటర్ లేదా 1.6 లీటర్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ నగరంలో 2000సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాల అమ్మకాల మీద నిషేదం విధించినందున్న హ్యుందాయ్ ఇంజనీర్లు ఇందులో తక్కువ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. టుసాన్ ఎస్‌యువిని ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లను అందించనున్నారు.
Also Read: మీ డ్రైవంగ్ శైలి మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోంది...?
త్వరలో దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్స్ దీనిని విడుదల చేయాలనే వ్యూహంలో ఉన్నారు. అంతే కాకుండా ఏడాది 15,000 నుండి 25,000 వరకు టుసాన్ ఎస్‌యువిల అమ్మకాలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియాకు రానున్న టుసాన్ ఎస్‌యువిలో సాంకేతిక మరియు ఇతర ఫీచర్ల గురించి ఏ విధమైన ముందస్తు సమాచారాన్ని వెల్లడించలేదు.
దేశీయంగా టుసాన్ ఎస్‌యువి విడుదల అయితే దీని ధర సుమారుగా16 నుండి 18 లక్షల మధ్య ఉండేట్లు హ్యుందాయ్ నిర్ణయించనుంది. అంతే కాకుండా దేశీయంగా ఉన్న హోండా సిఆర్-వి మరియు త్వరలో రానున్న నెక్ట్స్ జెన్ రెనో డస్టర్‌లకు పోటీగా నిలవనుంది.
హ్యుందాయ్ టుసాన్ ఎస్‌యువి విడుదలకు సంబందించిన పూర్తి వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.


Click it and Unblock the Notifications













