2017కు చెందిన హ్యుందాయ్ వెర్నా ఆవిష్కరణ: ఫోటోలు మరియు ఇతర వివరాలు
చైనాలోని బీజింగ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఆటో షోలో హ్యుందాయ్ మోటార్స్ తరువాత తరానికి చెందిన వెర్నా కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. దీనిని 2017 లో ఇండియన్ మార్కెట్లోకి పరిచయం చేయనున్నట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

డిజైన్ పరంగా చూస్తే ఇది హ్యుందాయ్ ప్లూయిడిక్ 2.0 ఫిలాసఫీ ఆధారంతో తయారయినట్లు చూడగానే తెలిసిపోతుంది. మరియు ముందు వైపున లోపలికి నెట్టినట్లు కనిపించే హెడ్ లైట్లు మరియు వైర్ మెష్ రూపంలో ఉన్న హెక్సోగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

దీనిని అన్ని వైపులా గమనిస్తే ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ వెర్నాకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

చాలా వరకు మార్పులు చోటు చేసుకున్న వాటిలో విశాలమైన ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, రీ డిజైన్ చేసిన బంపర్ మరియు నూతన శైలిలో ఉన్న అల్లాయ్ వీల్స్.

ఇందులో కొత్తగా సి-పిల్లర్స్ మరియు ఎలైట్ ఐ20 తరహాలో ఉండే ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్.

ప్రస్తుతం ప్రదర్శితం అయిన ఆ నెక్ట్స్ జనరేషన్ వెర్నా కేవలం కాన్సెప్ట్ మాత్రమే. అయితే ఇది ఉత్పత్తి దశకు చేరుకుంటే మరిన్ని మార్పులను పొందవచ్చని తెలిసింది.

దీనికి సంభందించిన ఇంజన్ మరియు ఇతర సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు. దీనికి సంభందించిన సమాచారం అందితే అప్డోట్ చేస్తాము. అంత వరకు తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తోకలిసి ఉండండి.

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ ఫ్రంట్ ప్రొఫైల్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ సైడ్ మిర్రర్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ డోర్ హ్యాండిల్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ అల్లాయ్ వీల్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ రియర్ వ్యూవ్ మరియు టెయిల్ ల్యాంప్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ ముందు వైపు ఉన్న హెడ్ ల్యాంప్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ రియర్ ప్రొఫైల్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ రియర్ అల్లాయ్ వీల్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ ప్రక్క వైపును సూచించే ఫోటో

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ ముందు వైపు డిజైన్లో ఉన్న హెడ్ ల్యాంప్స్ మరియు ప్రంట్ గ్రిల్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్

2017 హ్యుందాయ్ వెర్నా కాన్సెప్ట్ రియర్ సైడ్ వ్యూవ్

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం
హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ విడుదల


Click it and Unblock the Notifications








