నేటి నుండి వైజాగ్‌లో భారత విలాసవంతమైన కార్ల ప్రదర్శన ప్రారంభం
ది ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో (TILE) విశాఖపట్నంలో జూలై 2, 2016 నుండి ప్రారంభం కానుంది. ఈ వేదిక మీద దేశ వ్యాప్తంగా ఉన్న అత్యంత విలాసవంతమైన బ్రాండ్ల కార్ల ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.ఈ ప్రదర్శన సుమారుగా రెండు రోజుల పాటు జరగనుంది.

ఈ ఎగ్జిబిషన్‌లో అత్యంత విలాసవంతమైన కార్లు మరియు మోటార్ సైకిళ్లను ప్రదర్శించనున్నారు. వారి వారి ప్రత్యేకమైన మోడిఫికేషన్లతో కూడా ప్రదర్శించనున్నారు. ఈ లగ్జరీ ఎక్స్ పో లో ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ వారు భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.
అద్భుతమైన కార్లను కలిగి ఉన్న అక్కినేని ఫ్యామిలీ
TILE వ్యవస్థాపకులు కరణ్ భాంగాయ్ మాట్లాడుతూ, రానున్న కాలంలో ప్రపంచంలో అత్యంత వేగంగా సందను సృష్టించే జాబితాలో చోటు సాధించనున్నామని తెలిపాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,50,000 మంది వరకు మిలియనీర్లు ఉన్నారు. మరియు సుమారుగా మిలియన్ కు పైగా భారతీయులు 100,000 డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.
భారతీయ వినియోగదారులు లగ్జరీ వస్తువుల మీద సుమారుగా 650 బిలియన్ రుపాయలను వెచ్చిస్తున్నారు. ఇది ఏడాదికి 14 శాతం మేర పెరుగుతోంది.
లీటర్‌కు 102 కిమీల మైలేజ్‌నిచ్చే స్ల్పెండర్ ఐస్మార్ట్ సరికొత్త రూపంలో
TILE సహ వ్యవస్థాపకులైన విశాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇండియన్ లగ్జరీ ఎక్స్‌పో ముందు లగ్జరీ మార్కెట్ విరాదిల్లుతోంది. ఇక్కడికి మరిన్ని లగ్జరీ బ్రాండ్లను తీసుకురావడం జరుగుతుంది మరియు వాటికి తగ్గ వినియోగదారులను ఒక చోటకు చేర్చడం జరుగుతుంది.ఇందులో ఐశ్వర్యవంతుల ఆభిరుచిని బట్టి ఉత్పత్తులను ఎంపికచేసుకోవచ్చు.
ఇదే లగ్జరీ ఎక్స్ పో ఇంతకుమునుపు చెన్నై, హైదరాబాద్, ముంబాయ్, పూనే, ఛండీఘర్ మరియు ఢిల్లీలో జరిగింది.


Click it and Unblock the Notifications