డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనాన్ని విడుదల చేసిన ఇసుజు: ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు
ఇసుజు మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనాన్ని విడుదల చేసింది. అడ్వెంచర్ యుటిలిటి వాహనంగా చెప్పుకునే దీని ప్రారంభ ధర రూ. 12.46 లక్షలు ఎక్స్ షోరూమ్ (చెన్నై)గా ప్రకటించారు. దీనిని ముందస్తు బుకింగ్స్ చేసుకున్న వారికి జూలై 2016 నుండి డెలివరీ ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్
ఇసుజు మోటార్స్ డి-మ్యాక్స్ వి-క్రాస్ లో 2.5-లీటర్ విజిఎస్ టర్బో ఇంటర్ కూల్డ్ డీజల్ ఇంజన్‌ను అందించారు.

ట్రాన్స్‌మిషన్
ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. దీని ద్వారా ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ వాహనంలోని నాలుగు చక్రాలకు అందుతుంది.

పవర్ మరియు టార్క్ వివరాలు
ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ దాదాపుగా 134 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డి-మ్యాక్స్ వి-క్రాస్ లోని భద్రత ఫీచర్లు
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగులు
- ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- ఇసుజు గ్రావిటీ రెస్పాన్స్ ఇంటెలిజెంట్ ప్లాట్‌ఫామ్ (iGRIP)
- షిఫ్ట్ ఆన్ ఫ్లై డయల్ టైప్ 4 వీల్ డ్రైవ్

ఇంటీరియర్
ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఇంటీరియర్‌లో 7-అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇందులో బ్లూటూత్, యుఎస్‌బి, డివిడి, ఏయుఎక్స్ మరియు ఐపాడ్ కనెక్టివిటి కలవు.

విలాసవంతమైన ఫీచర్లు
ఇందులో విలాసవంతానికి సంభందించి ఆటో ఎయిర్ కండీషనర్, టిల్ట్ అడ్జెస్టబుల్ స్టీరింగ్, స్టీరింగ్ మీదున్న ఆడియో కంట్రోల్స్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఈ డి-మ్యాక్స్ వి-క్రాస్‌లో అందించారు.

తయారీ
జపాన్ ఆధారిత సంస్థ ఇసుజు ఈ వాహనాలను దేశీయంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీ సిటిలో ఉత్పత్తి చేస్తున్నారు.

పనితీరు
దీని పోటి దారులతో పోల్చుకుంటే ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనం ఎంతో మన్నికైనది మరియు విస్వసనీయ, ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనం.

పెట్రోల్, డీజల్ కార్ల కన్నా ఇవి ఎంతో నయం
కొత్త కారు స్టార్ట్ కాలేదు; గొడ్డలితో నరికేశాడు!


Click it and Unblock the Notifications








