విడుదలకు సిద్దమైన జాగ్వార్ ఎఫ్-ఫేస్ ఎస్‌యువి: బుకింగ్స్ ప్రారంభం
జాగ్వార్ దేశీయంగా తమ ఎఫ్-ఫేస్ ఎస్‌యువిని విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. జాగ్వార్ ఇప్పటికే తమ ఎఫ్-ఫేస్ ఎస్‌యువిని వివిధ దశలలో ఇండియన్ రహదారుల మీద పరీక్షించింది. 2016 సెప్టెంబర్ చివరి నాటికి అన్నీ సిద్దం చేసుకుని దేశీయ విపణిలోకి నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జాగ్వార్ ఎఫ్-ఫేస్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయితే సుమారుగా 80 లక్షల నుండి కోటి రుపాయల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దీనిని కంప్లిట్లీ బిల్ట్ యూనిట్‌గా దిగుమతి చేసుకుని అందివ్వనున్నారు. మరియు దేశీయంగా ఉన్న జాగ్వార్ డీలర్లు దీనిని 5 లక్షల రుపాయల ప్రారంభ ధరతో బుకింగ్స్ ప్రారంభించనున్నారు.

ఈ ఎఫ్-ఫేస్ ఎస్‌యువిలలో కేవలం డీజల్ ఇంజన్‌లను మాత్రమే అందిస్తున్నారు. ప్రారంభంలో 2.0-లీటర్ మరియు కాస్త ఆలస్యంగా 3.0-లీటర్ వి6 డీజల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. అన్ని ఇంజన్‌లకు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ఇంజన్‌ను అనుసంధానం చేయనున్నారు.

జగ్వార్ ఎక్స్ఇ ఫ్లాట్ ఆధారంతో ఈ ఎఫ్-ఫేస్ ఎస్‍యువిని అభివృద్ది చేసారు. మరియు మొత్తం 80 శాతం అల్యూమినియం లోహంతో దీనిని డిజైన్ చేశారు.

మొత్తం బరువు తగ్గడానికి వివిధ రకాల కొత్త పద్దతులను అవలంభించారు. డ్యాష్ బోర్డు లోపలి వైపున ఉన్న క్రాస్ భీమ్ ను మెగ్నీషియమ్ లోహంతో మరియు టెయిల్ గేట్‌ను విభిన్న పదార్థాల సమ్మేళనంతో రూపొందించారు.

జాగ్వార్ ఈ ఎఫ్-ఫేస్ ఎస్‌యువిని దేశీయంగా విడుదల చేస్తే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ మరియు రేంజ్ రోవర్ ఎవోక్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.

జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యువి

జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌యువి

దేశీయంగా విడుదలయిన తరువాత వినియోగదారులు దీనిని ఎంత వరకు స్వీకరిస్తారు మరియు దీని పనితీరు వంటివి గమనించాల్సి ఉంటుంది. జాగ్వార్ సంస్థకు చెందిన నూతన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుగులో పొందుటకు తెలుగు డ్రైవ్‌స్పార్క్ తో కలిసి ఉండండి.

- విమాన ప్రయాణానికి ముందు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడని ఆహార పదార్థాలు
- అత్యంత సరసమైన ధరతో సరికొత్త టయోటా ఎటియోస్ విడుదల
- హ్యాచ్‌బ్యాక్ దిగ్గజం స్విఫ్ట్ డెకా గురించి 10 ప్రత్యేకతలు


Click it and Unblock the Notifications








