జాగ్వార్ ఎఫ్ పేస్ లగ్జరీ ఎస్‌యువి బుకింగ్స్ ప్రారంభం
జాగ్వార్ ఇండియా దేశీయంగా తమ లగ్జరీ ఎస్‌యువిని అక్టోబర్ 20, 2056 నాడు విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. జాగ్వార్ ఇండియాకు దేశవ్యాప్తంగా ఉన్న 23 డీలర్ల నుండి జాగ్వార్ ఎఫ్ పేస్ ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానించింది.

జాగ్వార్ ఎప్ పేస్ ఎస్‌యువి వేరియంట్లు మరయు ధర వివరాలు
- ఎఫ్ పేస్ 2.0-లీటర్ డీజల్ ప్యూర్ ధర రూ. 68.40 లక్షలు
- ఎఫ్ పేస్ 2.0-లీటర్ డీజల్ ప్రెస్టేజ్ ధర రూ. 74.50 లక్షలు
- ఎఫ్ పేస్ 3.0-లీటర్ డీజల్ ఆర్-స్పోర్ట్ ధర రూ. 1.02 కోట్లు
- ఎఫ్ పేస్ 3.0-లీటర్ డీజల్ ఫస్ట్ ఎడిషన్ ధర రూ. 1.13 కోట్లు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- వీటిని కొనాలంటే ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సిందే...!!
- విస్పోటనం సృష్టించిన ఆ కారును మళ్లీ విడుదల చేస్తామంటున్నారు
- ఐదు విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500

జాగ్వార్ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి ఈ ఎఫ్ పేస్ లగ్జరీ ఎస్‌యువిని బుక్ చేసుకోవచ్చు.

జాగ్వార్ ఈ ఎఫ్-పేస్ లగ్జరీ ఎస్‌యువినీ కంప్లిట్లీ బిల్ట్ యూనిట్‌గా అందిస్తోంది. అయితే భవిష్యత్తులో దీనిని దేశీయంగా ఉత్పత్తి అవకాశం కూడా ఉంది.

జాగ్వార్ ఎఫ్ పేస్ ఎస్‌యువి ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే పోర్షే మకన్, ఆడి క్యూ7, వోల్వో ఎక్స్‌సి90, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

ఈ ఎఫ్-ఫేస్ ఎస్‌యువిలో కేవలం డీజల్ ఇంజన్‌లను మాత్రమే అందిస్తున్నారు. ప్రారంభంలో 2.0-లీటర్ మరియు కాస్త ఆలస్యంగా 3.0-లీటర్ వి6 డీజల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

అన్ని ఇంజన్‌లకు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ఇంజన్‌ను అనుసంధానం చేయనున్నారు.

జగ్వార్ ఎక్స్ఇ ఫ్లాట్ ఆధారంతో ఈ ఎఫ్-ఫేస్ ఎస్‍యువిని అభివృద్ది చేసారు. మరియు మొత్తం 80 శాతం అల్యూమినియం లోహంతో దీనిని డిజైన్ చేశారు.

మొత్తం బరువు తగ్గడానికి వివిధ రకాల కొత్త పద్దతులను అవలంభించారు. డ్యాష్ బోర్డు లోపలి వైపున ఉన్న క్రాస్ భీమ్ ను మెగ్నీషియమ్ లోహంతో మరియు టెయిల్ గేట్‌ను విభిన్న పదార్థాల సమ్మేళనంతో రూపొందించారు.

దేశీయంగా విడుదలయిన తరువాత వినియోగదారులు దీనిని ఎంత వరకు స్వీకరిస్తారు మరియు దీని పనితీరు వంటివి గమనించాల్సి ఉంటుంది. జాగ్వార్ సంస్థకు చెందిన నూతన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుగులో పొందుటకు తెలుగు డ్రైవ్‌స్పార్క్ తో కలిసి ఉండండి.



Click it and Unblock the Notifications








