ఎలక్ట్రిక్ ఎస్‌యువిని ప్రవేశపెట్టిన జాగ్వార్

ఐ-పేస్ కాన్సెప్ట్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యువిని బహిర్గతం చేసింది. దీనిని అతి త్వరలో జరగబోయే లాస్ ఏంజిల్స్ ఆటో షో వేదిక మీద ప్రదర్శించనుంది.

By Anil

బ్రిటీష్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్ తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యువిని ఆవిష్కరించింది. అతి త్వరలో 2016 లాస్ ఏంజిల్స్ ఆటో షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐ-పేస్ కాన్సెప్ట్‌ను ఎలక్ట్రిక్ ఎస్‌యువిగా పరిచయం చేయడం గమనార్హం. 2018 నుండి దీనిని ఉత్పత్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలకు సిద్దం చేయనుంది జాగ్వార్.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

జాగ్వార్ డిజైన్ విభాగాధ్యక్షులు ఇయాన్ కల్లమ్ మాట్లాడుతూ, ఇది 5-సీట్ ప్రొడక్షన్ యొక్క ప్రివ్యూవ్ మాత్రమే. పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యువిని 2018 నాటికి అమ్మకాలకు సిద్దంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాడు.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

బ్యాటరీ పవర్ ఆధారంతో నడిచే మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యువిని రూపొందించడంతో జాగ్వార్ సంస్థ కొత్త అధ్యయనాన్ని ప్రారంభించినట్లు అతను తెలిపాడు.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

ఇప్పుడు టాటాకు చెందిన ఈ జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి విడుదలతో చరిత్రను సృష్టించనుంది. దేశీయంగా ఇప్పటికే మంచి ఫలితాలను సాధిస్తున్న జాగ్వార్ 2018 నాటికి ఐ-పేస్ విడుదలతో అమ్మకాల పరంగా మరిన్ని అంచులను తాకనుంది.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి యొక్క ఛాసిస్ ను ప్రత్యేకించి ఎలక్ట్రిక్ డ్రైల్ ట్రైన్ కోసం నిర్మించారు. అదనపు విడిభాగాలు లేనందు వలన ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ మరియు లైట్ వెయిట్ వంటి వాటికి ఇందులో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

సాంకేతికంగా జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువిలో లిక్విడ్ కూల్డ్ 60 కిలోవాట్అవర్ బ్యాటరీ కలదు. రెండు యాక్సిల్స్‌కు నాలుగు చక్రాల వద్ద 200హార్స్ పవర్ సామర్థ్యం గల మోటార్లు కలవు.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

ఈ ఎస్‌యువిలోని నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు సంయుక్తంగా 400 హార్స్‌పవర్ మరియు 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

పూర్తి స్థాయిలో చార్జ్ అయిన బాటరీ నుండి నాలుగు చక్రాలకు పవర్ సమాంతరంగా సరఫరా చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువి గరిష్ట పరిధి 500కిలోమీటర్లుగా ఉంది. అంటే ఒక్క సారి చార్జింగ్ ద్వారా 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

ఐ-పేస్ లోని ఇంటీరియర్‌ని విండ్సర్ లెథర్. అల్యూమినియం, కార్బన్ పైబర్ వంటి వాటితో డిజైన్ చేశారు. డ్రైవర్ కోసం 12-అంగుళాల హెచ్‌డి వర్చువల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మరియు సెకండరీ 10-అంగుళాల టిఎఫ్‌టి డిస్ల్పే సెంటర్ కన్సోల్‌లో కలదు.

జాగ్వార్ ఐ పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి

జాగ్వార్ ఇప్పటికే ఈ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యువికి సంభందించిన బుకింగ్స్‌ను తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వీకరిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న లాస్ ఏంజిల్స్ ఆటో షో వేదిక మీద దీనిని ప్రదర్శించనున్నారు.

.

  • మిలిటరీ రైళ్ల గురించి.. మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..
  • ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన హ్యుందాయ్ టక్సన్
  • ఇగ్నిస్ గురించి గుడ్ న్యూస్

More from DriveSpark

Article Published On: Tuesday, November 15, 2016, 15:03 [IST]
English summary
Jaguar Unveils An Electric SUV — The Jaguar I-PACE
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+