జాగ్వార్ ఎక్స్ఇ ప్రెస్టేజ్ విడుదల: ధర రూ. 43.69 లక్షలు
జాగ్వార్ ఇండియా తమ ఎక్స్ఇ శ్రేణి సెడాన్ వేరియంట్లకు మరింత విలువను జోడించి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రెస్టేజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చిన జాగ్వారా ఎక్స్‌ఇ వేరియంట్ ధర రూ. 43.69 లక్షలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్‍గా ఉన్నట్లు తెలిపారు. దీనికి ముందు జాగ్వార్ ఎక్స్‌ఇ నుండి ప్యూర్ మరియు ఫోర్ట్‌ఫోలియో రేంజ్‌లలో మాత్రమే లభించేది.
ఇండియాలో ఉన్న జాగ్వార్ ఎక్స్ఇ పెట్రోల్ రేంజ్ ధరలు:
- జాగ్వార్ ఎక్స్ఇ ప్యూర్ ధర రూ. 39.9 లక్షలు
- జాగ్వార్ ఎక్స్ఇ ప్రెస్టేజ్ ధర రూ. 43.69 లక్షలు
- జాగ్వార్ ఎక్స్ఇ ఫోర్ట్‌ఫోలియో ధర రూ. 47.99 లక్షలు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌గా గుర్తించగలరు.

ప్రస్తుతం జాగ్వార్ తమ ఎక్స్ఇ రేంజ్ లగ్జరీ సెడాన్ కార్లను దేశవ్యాప్తంగా ఉన్న 23 రిటైల్ అవుట్‌లెట్స్ నుండి అమ్మకాలు చేపట్టింది. ఈ ఎక్స్‌ఇ లగ్జరీ సెడాన్ కారులో 2.0 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.
మే 2016 లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 కార్లు: టాప్-10లో మారుతివే ఏడు కార్లు
టారస్ లెథర్ సీట్లు, డ్రైవర్ సీట్ మెమొరీ ఫంక్షన్, ఇంటీరియర్ మూడ్ లైటింగ్, స్లైడింగ్ రూఫ్, రియర్ వ్యూవ్ కెమెరా మరియిు 380 డబ్ల్యూ మెరేడియన్ సౌండ్ సిస్టమ్ కలదు. అన్ని ఫీచర్లు కూడా జాగ్వార్ ఎక్స్ఇ ప్రెస్టేజ్ వేరియంట్లో లభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. జాగ్వార్ నుండి వచ్చిన ఈ ప్రెస్టేజ్ రేంజ్ సెడాన్ తమ శ్రేణిలోని సరికొత్త మిడ్ వేరియంట్‌గా ప్రకటించారు.
2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద జాగ్వార్ ప్రదర్శించిన ఎక్స్‌ఇ కారు: ఫోటోలు....


Click it and Unblock the Notifications






































