పరీక్షలకు వచ్చి పోయిన జీప్ రెనిగేడ్

Written By:

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్‌లో ఒక భాగమైన జీప్ సంస్థ ఇండియాలోని తమిళనాడులో తమ రేనిగేడ్ వాహనానికి రహదారి పరీక్షలు నిర్వహించారు. దీనికి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఇది స్కోడా వారి యెటి కారును పోలి ఉంది.


భారతీయ రహదారుల మీద పరీక్షలు ముగించకున్న జీప్ రెనిగేడ్‌లో 2.0-లీటర్ మల్టీజెట్ డీజల్ ఇంజన్ కలదు. అయితే ఇప్పటికే ఈ 2.0-లీటర్ ఇంజన్‌ కలిగిన జీప్ రెనిగేడ్ వాహనాలు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అమ్మకాలు సాగుతున్నాయి.
Also Read: మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు
జీప్ సంస్థకు ఇండియాలో మాతృ సంస్థగా వ్యవహరిస్తున్న ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ సంస్థ ఈ రెనిగేడ్ పరీక్షల గురించి మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లో చాలా చిన్న వాహనం అని తెలిపింది. అయితే ఇందులో వినియోగించిన విడి భాగాలు మరియు పవర్‌ ట్రైన్‌లను జీప్ వారి అప్ కమింగ్ సి-ఎస్‌యువిలో వినియోగించనున్నట్లు తెలిపారు.
Also Read: డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు
పరీక్షలకు వచ్చిన రెనిగేడ్‌తో పోల్చితే సి-ఎస్‌యువి పెద్దగా ఉంటుంది. ఈ సి-ఎస్‌యువిని కూడా రెనిగేడ్ ను అభివృద్దిన చేస్తున్న ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేస్తున్నట్లు మరియు ఈ రెనిగేడ్ వాహనాన్ని 2018 నాటికి ఇండియా మరియు బ్రెజిల్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
Also Read: 2016 ఏడాదిలో 125సీసీ విభాగంలో ఉత్తమ మైలేజ్ ఇచ్చే 8 బైకులు
ప్రస్తుతం ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ సంస్థకు పూనేలో ఉన్న రంజన్‌గాన్ ప్లాంట్‌లో ఈ ప్రీమియమ్ క్రాసోవర్ కారును ఉత్పత్తి చేనున్నారు. ఇక్కడ తయారైన వాటిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుతి చేయనున్నారు.
 Source

Read more on: #జీప్ #jeep
English summary
Jeep Renegade Spotted Testing In India
Please Wait while comments are loading...

Latest Photos