యుకె లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించిన జాగ్వార్ ల్యాండ్ రోవర్
జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల తయారి సంస్థ యుకె మొత్తానికి అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా పేరు తెచ్చుకుంది. దాదాపుగా ఏడు సంవత్సరాల తరువాత టాటా మోటార్స్ ను వెనక్కి నెట్టి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ స్థానంలో నిలిచింది. నిస్సాన్ రెండవ స్థానానికి పరిమితం అయ్యింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ గడిచిన సంవత్సరంలో దాదాపుగా 489,923 యూనిట్ల కార్ల అమ్మకాలను బ్రిటన్‌లో జరిపింది. ప్రజలకు నిభద్దతో మంచి సేవలు అందిస్తూ వినియోగదారుల అవసరాలకు అనుగుణం ఉత్పత్తులను అందించిడం ఈ స్థానంలో నిలిచినట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారీ రంగానికి చెందిన ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ స్టాడ్లర్ తెలిపారు.


Click it and Unblock the Notifications




