రూ. 2 కోట్లు విలువైన గాడ్జిల్లా ను ఆర్డర్ చేసిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్‌లో బైకులను అమితంగా ఇష్టపడే మరియు కొనుగోలు చేసే నటుడు ఎవరంటే వెంటనే జాన్ అబ్రహాం గుర్తొస్తాడు. అయితే ఈ బాలీవుడ్ నటుడు జపనీస్ బ్యూటీ కోసం ఏ/సి గ్యారేజ్‌ను సైతం సిద్దం చేస్తున్నాడు.
జపనీస్ బ్యూటీ ఏంటి ? ఆర్డర్ ఏంటి ? రెండు కోట్లు రుపాయలేంటి ? అని అయోమయంలో ఉన్నారా... జపాన్‌కు చెందిన నిస్సాన్ గాడ్జిల్లా కారును ముద్దుగా జపనీస్ బ్యూటీని సంభోదించాము. ఈ కారును ఎంచుకునే వారు చాలా చాలా తక్కువ. ఈ జపనీస్ బ్యూటీని ఆర్డర్ చేసి ఆ జాబితా సరసన మన బాలీవుడ్ కథానాయకుడు జాన్ ఆబ్రహాం చేరాడు.

బాలీవుడ్ యాక్టర్ జాన్ ఆబ్రహాం నిస్సాన్‌కు చెందిన బ్లాక్ ఎడిషన్ జిటి-ఆర్ కారును, (దీనినే గాడ్జిల్లా అని కూడా పిలుస్తారు) ఆర్డర్ చేశాడు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌కు అద్బుతు రూపంగా చెప్పుకునే దీని ధర సుమారుగా రెండు కోట్ల రుపాయలు పైమాటే.

జాన్ అబ్రహాం అభిమానులందరికీ బాగా తెలిసిన విషయం ఏమిటంటే అబ్రహాంకు బైకులంటే విపరీతమైన ఇష్టం. విభిన్న మోటార్ సైకిళ్లను ఎంచుకోవడంలో అబ్రహాం దిట్ట అని చెప్పవచ్చు.

తన గ్యారేజిలోకి బైకులతో పాటు అత్యంత ఖరీదైన గాడ్జల్లాను కూడా తీసుకెళుతున్నాడు. ఇందుకోసం గాడ్జిల్లాకు తగ్గట్టుగా గ్యారేజిని డిజైన్ చేయిస్తున్నాడు ఈ నటుడు. దీనిని డెలివరీ తీసుకోవడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.

జపాన్‌కు చెందిన నిస్సాన్ ఈ జిటి-ఆర్ కారును ఇండియన్ మార్కెట్లో నవంబర్ 9, 2016 న విడుదల చేసింది. మొదటి నిస్సాన్ జిటి-ఆర్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది.

తరువాత 2016 న్యూ యార్క్ ఆటో షో వేదిక మీద అప్‌డేటెడ్ మోడల్‌గా 2017 నిస్సాన్ జిటి-ఆర్ ను ప్రదర్శించారు. జాన్ ఇప్పుడు ఈ అప్‌డేటెడ్ వేరియంట్‌ను ఎంచుకుంటున్నాడు.

సాంకేతికంగా ఈ నిస్సాన్ గాడ్జిల్లాలో 3.8-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ వి6 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 562బిహెచ్‌పి పవర్ మరియు 637ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

కేవలం 3 సెకండ్ల కాలంలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 307 కిలోమీటర్లుగా ఉంది.

ఈ జిటి-ఆర్ లో ముందువైపున ఆరు పిస్టన్ల కాలిపర్ అనుసంధానం గల 390ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున నాలుగు పిస్టన్ కాలిపర్ల అనుసంధానం గల 380ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

ఈ ఏడాది ప్రారంభంలో జాన్ అబ్రహాం మాట్లాడుతూ, జర్మనీ ఎస్‌యువిల తో విసుగెత్తి పోయాను ఇప్పుడు నిస్సాన్ గాడ్జిల్లా మీద ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు తెలిపాడు.

- జాన్ అబ్రహాం లైఫ్ లోకి మరో పార్ట్ నర్
- ఫెరారి కార్లను కలిగి ఉన్న పది ఇండియన్ సెలబ్రిటీలు
- అక్కినేని ఫ్యామిలీ కార్ కలెక్షన్


Click it and Unblock the Notifications








