సారీ బెంట్లీ: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎస్‌యవి ఇదే, బెంట్లీని దాటిపోయింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన కార్లు అనగానే, బెంట్లీ, ల్యాంబోర్గిని, ఫెరారి, పోర్షే వంటి సంస్థలకు చెందిన కార్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఎస్‌యువిని అందించిన బెంట్లీకి సారీ చెప్పాలి ఎందుకంటే దీని కంటే ఖరీదైన కారు కార్లమన్ కింగ్ ఎస్‌యువి వచ్చింది. దీని ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

కేవలం 10 కార్లమన్ కింగ్ ఎస్‌యువి వాహనాలను మాత్రమే తయారు చేశారు. వీటి ఒక్కొక్క దాని ధర సుమారుగా 1.84 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. అదే మన రుపాయల్లో అయితే దీని ధర రూ. 12.7 కోట్లుగా ఉంది. అంటే తాజాగా ఇండియన్ మార్కెట్లోకి బెంట్లీ అందించిన బెంట్యాగా కన్నా ఇది ఎక్కువన్నమాట.
Also Read: బజాజ్ పల్సర్ సిఎస్400 గురించి 9 ముఖ్యమైన విషయాలు
డిజైన్ పరంగా ఈ కార్లమన్ ఎస్‌యువి అన్ని మూలల్లో కూడా పదునుగా ఉంటుంది. ముఖ్యంగా డైమండ్ కట్ ఆకారంలో దీని బాడీలోని అన్ని భాగాలను డిజైన్ చేశారు. ల్యాంబోర్గిని ఉరస్‌కు చెందిన పోలికలతో దీనిని అభివృద్ది చేసినట్లు కనబడుతుంది.
Also Read: ఇన్నోవా క్రిస్టాను ఇష్టపడేవారి కోసం మాత్రమే: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర వివరాలు
ఇందులోని ఇంటీరియర్ లోపల ఎక్కువ మోతాదులో లెథర్‌ను వినియోగించారు. అలాగే ఇంటీరియర్ లోపల చెక్క మరియు బంగారపు పదార్థాలతో కూడా రూపొందించారు. టీ సెట్, వైన్ గ్లాసులు మరియు ఫ్రిడ్జ్ కూడా ఇందులో కలదు.


Click it and Unblock the Notifications
















