కర్ణాటక బస్సులు అధిక పొగను వెదజల్లుతున్నయా ? అయితే ఫోన్ చేసి చెప్పిండి డబ్బులు పొందండి.
మీరు కర్ణాటకలో నివసిస్తున్నారా ? అయితే కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే బిఎమ్‌టిసి మరియు కెఎస్‌ఐఆర్‌టిసి బస్సులు అధిక పొగను వెదజల్లుతూ నడుస్తుంటే వాటిని గుర్తించి వారి ప్రభుత్వానికి తెలిపితే మీరు 1000 రుపాయల వరకు సంపాదించవచ్చు మరియు ఆ బస్సులను సర్వీసు నుండి తొలగిస్తారు.

ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) మరియు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (BMTC) సంస్థలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం. ప్రజానీకం వారి ప్రాంతాలలో ఎక్కువగా పొగను వెదజల్లే బస్సులను గుర్తించి వాటిని సంస్థ దృష్టికి తీసుకుచ్చే విధానానికి తెరతీసారు.
ఇది సింగపూర్ ఎయిర్ పోర్ట్ కాదు: AP లోని ఒక APSRTC బస్టాండ్
KSRTC అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు అలాంటి బస్సులను గుర్తించి మాకు సమాచారం అందించారు. వాటిని సర్వీసు నుండి తొలగించి మరియు ఆ ముగ్గురికి ముందుగా చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కరికి 1000 రుపాయల చెప్పున అందజేశామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కాలుష్య రహిత బస్సులను నడిపే అవకాశం పెరుగుతుందన్నారు.
జిపిఎస్‌ను నమ్మింది 100 నూతిలో నిండా ముంచింది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా బిఎమ్‌టిసి గత ఏడాదిలో సుమారుగా 135 బస్సులను 20 శాతం బయో డీజల్‌తో నడిచే విధంగా ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. తద్వారా కేవలం నెల రోజుల్లోనే 5,000 లీటర్ల డీజల్‌ను సేవ్ చేయగలిగారు.
ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు
కాబట్టి మీరు ఎక్కడైనా ఎక్కువ పొగను వెదజల్లుతున్న కర్ణాటక బస్సులను కనుక గుర్తించినట్లయితే బిఎమ్‌టిసి హెల్ప్‌లైన్ (1-800-425-1663) అనే నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలపండి మరియు దానికి తగిన డబ్బును సంపాదించుకోండి.


Click it and Unblock the Notifications








