మహీంద్రా వారి బెస్ట్ సెల్లింగ్ వెహికల్: కెయువి100
బొలెరో ఎస్‌యువి ఎన్నో ఏళ్ల పాటు మహీంద్రా సంస్థకు బెస్ట్ సెల్లింగ్ వెహికల్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు బొలెరో ఆ స్థానం నుండి తప్పుకుంది. మహీంద్రా వారి సరికొత్త కెయువి బొలెరో స్థానాన్ని ఆక్రమించుకుంది.

గడిచిన 2016 మే నెలలో మహీంద్రా సుమారుగా 4,446 యూనిట్ల కెయువిల అమ్మకాలు జరిపింది. మహీంద్రా బొలెరో కన్నా 27 యూనిట్లు ఎక్కువ అమ్ముడుపోయి మొదటి స్థానంలోకి చేరింది. అంటే పెద్ద పెద్ద ఎస్‌యువిల నుండి వినియోగదారులు సిటికి అనువైన చిన్న ఎస్‌యువి (కెయువి100)ల మీద దృష్టి సారించినట్లు స్పష్టం అవుతోంది.
మహీంద్రా బొలెరో అమ్మకాలు క్షీణించడానికి ఉన్న కారణాలలో విడుదలైనప్పటి నుండి ఒకే మోడల్‌ను కొనసాగించడం, ప్రాథమిక ఫీచర్లయిన ఏ/సి వంటివి ఇందులో లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. దీనితో పాటు ఇది పెద్ద పరిమాణంలో ఉంటూ అధిక స్పేస్‌ను కలిగి ఉంటోంది.
Review: మహీంద్రా కెయువి100 రివ్యూ: మైలేజ్, ఫీచర్లు కోసం....
కెయువి100 విషయానికి వస్తే ఉత్తమ డిజైన్‌తో పాటు ఇందులో మూడు సిలిండర్ల 1.2 లీటర్ పెట్రోల్ లేదా డీజల్ ఇంజన్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని పెట్రోల్ వేరియంట్ 82 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అదేవిధంగా 77 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రెండు ఇంజన్ రకాలు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో అనుసంధానం అయ్యాయి. కెయువి100 పెట్రోల్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 5,44,747 మరియు కెయువి100 డీజల్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 6,53,527 లు ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications























