ఆగిపోతున్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఉత్పత్తి
జాగ్వార్ ల్యాండ్ రోవర్ వారి ఢిఫెండర్ వాహనాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేమిస్తున్నారు. అయితే వారందరికి ఒక చేదు వార్త ఎందుకంటే ల్యాండ్ రోవర్ సంస్థ ఈ డిఫెండర్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తోంది.

దాదాపుగా 68 సంవత్సరాల సుధీర్ఘ కాలం పాటు ఉత్పత్తి అవుతు వచ్చిన డిఫెండర్ వాహనాలను ఇప్పుడు నిలిపివేస్తున్నారు. ల్యాండ్ రోవర్ సంస్థ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లోడే లేన్ లో గల సోలిహల్ ప్లాంటు ద్వారా చివరి డిఫెండర్ వాహనాన్ని తయారు చేసినట్లు ప్రకటించారు.
1948 నుండి ఇప్పటి వరకు ల్యాండ్ రోవర్ సంస్థ దాదాపుగా రెండు మిలియన్ల డిఫెండర్ వాహనాలను విక్రయించినట్లు తెలిపారు. అందులో దాదాపుగా 308 మోడల్స్ ఉన్నట్లు తెలిసింది.
ఇలా డిఫెండర్ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే యూరోపియన్ యూనియన్ ఎమిషన్స్ మరియు సేఫ్టీ రెగ్యులేషన్స్ వారి తీవ్రమైన ఒత్తిడి కారణంగా వీటి ఉత్పత్తని నిలిపివేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications


















