కొత్త పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చిన డిస్కవరీ స్పోర్ట్
జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా సంస్థ దేశీయంగా తమ ఉత్పత్తులకు మరింత విలువలను చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. ల్యాండ్ రోవర్ వారి డిస్కవరీ స్పోర్ట్‌ను సరికొత్త 2.0 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి తెచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ల్యాండ్ రోవర్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను డిస్కవరీ స్పోర్ట్‌లో ఉన్న హెచ్‌ఎస్ఇ వేరియంట్లో మాత్రమే అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 237.36బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉన్న డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యువి ధర రూ. 56.50 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

ఈ డిస్కవరీ స్పోర్ట్ ఇంతకు మునుపు 2.2 లీటర్ టిడి4 లేదా 2.2 లీటర్ ఎస్‌డి4 ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండేది.

ల్యాండ్ రోవర్ సంస్థ ఈ డిస్కవరీ స్పోర్ట్‌ను మొదటి సారిగా ఇండియన్ మార్కెట్లోకి 2015 సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ ప్రీమియమ్ మరియు లగ్జరీ ఎస్‌యువిలో రోటరీ డ్రైవ్ సెలెక్టర్ గల 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

ఇందులో టెర్రైన్ రెస్పాన్స్, రియర్ వ్యూవ్ కెమెర, పార్కింగ్ అసిస్ట్ మరియు ఎన్నో ఆధునిక ఫీచర్లున్నాయి.

డిజైన్ పరంగా ఈ 2.0 లీటర్ పెట్రోల్ డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యువి ప్రస్తుతం ఇండియాలో విరివిగా అమ్ముడుపోతున్న రేంజ్ రోవర్‌లను పోలి ఉంటుంది.

ఇందులో 5+2 సీటింగ్‌ను అందించారు.

డిస్కవరీ స్పోర్ట్‌ను 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో అందివ్వడానికి కారణం ఢిల్లీలో అధిక సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల అమ్మకాలు నిషేధం కారణంగా అని తెలిసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్
జెస్ట్, స్విఫ్ట్ డిజైర్, ఎక్సెంట్ లకు జోడీగా షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్


Click it and Unblock the Notifications








