2017 ఏడాదిలో 9 మోడళ్లను విడుదల చేయనున్న మెర్సిడెస్ బెంజ్
జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన మరియు ఖరీదైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 2017 ఏడాదికి గాను సుమారుగా తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు రహస్య సమాచారం వెల్లడైంది. రహస్యంగా వెల్లడైన డాక్యుమెంట్ ప్రకారం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

వచ్చే ఏడాదికి సుమారుగా 9 ఉత్పత్తులను సిద్దం చేయనున్నట్లు తెలిసింది. అందులో మెర్సిడెస్ బ్యాడ్జిని కలిగి ఉండే ఒక పికప్ ట్రక్ మరియు స్మార్ట్ బ్యాడ్జిని కలిగి ఉండే రెండు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.
Also Read: భవిష్యత్ ప్రయాణం ఇలా ఉంటుందంటే నమ్మగలరా...?
రహస్యంగా విడుదలైన సమాచారం ప్రకారం ఇ-క్లాస్ శ్రేణి నుండి మూడు ఉత్పత్తులు రానున్నాయి. అందులో ఇ-క్లాస్ కూపే, ఇ-క్లాస్ క్యాబ్రియోలెట్ మరియు ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్ (ఇ-క్లాస్ శ్రేణిలో ఇది సాఫ్ట్ రోడర్).
Also Read: మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఉన్న టాప్-10 కార్లు
మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిటి స్పోర్ట్స్ కార్ ప్రియులను ఆకట్టుకునేందుకు దీనిని ఏఎమ్‌జి జిటి సి అనే పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ జిటి సి స్పోర్ట్స్ కారు కూపే మరియు రోడ్‌స్టర్ రెండు రూపాల్లో కూడా విడుదల కానున్నట్లు తెలిసింది. జిటి సి అనుదానిలో సి అనగా క్లబ్‌స్పోర్ట్ అని అర్థం. సరికొత్త ట్రిమ్ లెవల్‌గా అందుబాటులోకి వస్తున్న ఇది జిటి ఎస్ మరియు జిటి ఆర్ మధ్యలో ఉండనుంది. జిటి ఆర్ విషయానికి వస్తే ఇది ఇప్పటికే విడుదలైంది, దీనిని 2017 నుండి డెలివరీ ఇవ్వనున్నారు.
Also Read: అమరావతిలో మొదటి మెర్సిడెస్ బెంజ్ షోరూమ్ ప్రారంభం
ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్‌కు సమాచారంలో రోడ్‌మ్యాప్ నిజం కానుంది మరియు మెర్సిడెస్ పికప్ ట్రక్ కూడా అందుబాటులోకి రానుంది. జిఎల్‌టి బ్యాడ్జితో వచ్చే అవకాశాలున్న ఈ ట్రక్కు నిస్సాన్ నవారా ఎన్‌పి300 కు పోటీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications








