ఈ ఏడాదిలో లెక్సస్‌ను విడుదల చేయనున్న టయోటా
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లోకి హైబ్రిడ్ కారును తీసుకురావాలని పథకం పన్నుతోంది. టయోటా మోటార్స్ లెక్సస్ అనే పేరుతో ఇకానిక్ హైబ్రిడ్ కారును ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనికి చెందిన ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

ఈ మధ్య కాలంలో హైబ్రిడ్ అనే పదం ఎక్కువగా వినపడుతోంది కదా. హైబ్రిడ్ కార్లు అనగా సాధారణ కార్లతో పోల్చగా ఇవి వాతావరణంలోకి తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. అందుకోసం వీటిలో ప్రత్యేకంగా పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన ఇంజన్‌లను అందిస్తారు. అయితే రెండు కూడా సంయుక్తంగా పని చేయడం వలన కాలుష్య కారకాలు తక్కువగా విడుదల అవుతాయి. ప్రస్తుతం కాలుష్యం పెచ్చుమీరుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు హైబ్రిడ్ వాహనాల కొనుగోలును పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read: స్కోడా సూపర్బ్: ఇది నిజంగానే సూపర్
టయోటా మోటార్స్ వారు దేశీయ మార్కెట్లోకి అత్యంత లగ్జరీ లెక్సస్ హైబ్రిడ్ కారును ప్రవేశపెట్టనుంది. లగ్జరీ కార్లకు చిరునామా నిలిచిన ఆడి, బిఎమ్‌డబ్ల్యూ మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి వాహన సంస్థలు ఇప్పుటికే హైబ్రిడ్ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే వీటికి పోటీగా టయోటా మోటార్స్ లెక్సస్ కారును విడుదల చేయనుంది.
Also Read: భారతీయ మార్కెట్లోకి ఫియట్ పుంటో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్
టయోటా మోటార్స్ వారి ఆర్‌ఎక్స్ కాంపాక్ట్ ఎస్‌యువి నుండి ఆర్‌ఎక్స్ 450హెచ్ హైబ్రిడ్ కారును ప్రవేశ పెట్టింది. ఈ ఆర్‌ఎక్స్ 450హెచ్ లో 3.5-లీటర్ కెపాసిట గల వి6 ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇది దాదాపుగా 308 బిహెచ్‌పి పవర్ ను విడుదల చేయగలదు. టయటా మోటార్స్ వారు తమ లెక్సస్ హైబ్రిడ్ కారులో ఈ ఇంజన్‌ను వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications






















